హైదరాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా అరెస్ట్
  • ముగ్గురు నిర్వాహకులు, 8 మంది కస్టమర్లు అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫారిన్​లో జాబ్​ల కోసం ఫేక్ సర్టిఫికెట్స్‌‌‌‌ సప్లయ్ చేస్తున్న కన్సల్టెన్సీ నిర్వాహకులు ముగ్గురిని, 8 మంది కస్టమర్లను  సౌత్‌‌‌‌జోన్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు  అరెస్ట్ చేశారు. యాకత్​పురాకి చెందిన సయ్యద్ నవీద్‌‌‌‌(30), మీరాలంమండికి చెందిన సయ్యద్‌‌‌‌ నదీమ్(25),  మహ్మద్‌‌‌‌ అబ్రార్ ఉద్దీన్‌‌‌‌(22) సంతోష్‌‌‌‌ నగర్‌‌‌‌, బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌లో క్యూబెజ్‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌సిస్‌‌‌‌ పేరుతో కన్సల్టెన్సీ రన్ చేస్తున్నారు. అర్హత లేకుండా ఫారిన్ వెళ్ళే వారికి వీసా ప్రాసెస్‌‌‌‌ చేస్తున్నారు.  అబ్రాడ్‌‌‌‌లో టెక్నికల్ జాబ్స్‌‌‌‌ కోసం డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్స్ సప్లయ్ చేస్తున్నారు. రూ.70 వేల నుంచి రూ.80 వేలు వసూలు చేస్తున్నారు. సంతోష్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన అబ్దుల్‌‌‌‌ రహీం ఖాన్‌‌‌‌, కరీంఖాన్‌‌‌‌, ఇస్మాయిల్ అహ్మద్‌‌‌‌, నసీర్ అహ్మద్‌‌‌‌,కామారెడ్డి జిల్లాకు చెందిన ఫైజల్‌‌‌‌ బిన్‌‌‌‌ షదుల్లా ఈ  ఫేక్ సర్టిఫికెట్లను కొన్నారు. బుధవారం పోలీసులు నిర్వాహకులతో పాటు సర్టిఫికెట్లు కొన్నవారిని అదుపులోకి తీసుకున్నారు.  వీరి నుంచి 4 ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ,3 ఓయూ డిగ్రీ  సర్టిఫికెట్స్‌‌‌‌, 30 తెలంగాణ వర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్స్,ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన 7 బీటెక్‌‌‌‌ సర్టిఫికెట్స్‌‌‌‌ ఇలా మొత్తం 53 ఫేక్ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నారు.