బంగారం ధర ఇంత బీభత్సంగా పెరిగిందేంటయ్యా..? ఆల్ టైం హైకి పోయింది !

బంగారం ధర ఇంత బీభత్సంగా పెరిగిందేంటయ్యా..? ఆల్ టైం హైకి పోయింది !

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం బంగారం ధరలు భగ్గుమన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర లక్షా 44 వేల 600కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.15 వేలు పెరిగి 2 లక్షల 65 వేల ఆల్ టైం హైకి చేరింది. బంగారం ధర సోమవారం రూ.2 వేల 900 పెరిగి 10 గ్రాములకు రూ.1,44,600 గరిష్టానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో, స్పాట్ గోల్డ్ మొదటిసారిగా ఔన్సుకు USD 4,600 స్థాయిని దాటింది.

ఇరాన్‌లో అశాంతి పెరగడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం.. యుద్ధ వాతావరణం.. భౌగోళిక రాజకీయ ఆందోళనలు బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. బంగారంపై పెట్టుబడి సురక్షితంగా భావించడం.. ప్రజలు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

►ALSO READ | కొత్త స్మార్ట్ ఫోన్ రూల్స్.. ప్రభుత్వం చేతిలోనే ఫోన్ అప్‌డేట్స్, మోడీ సర్కార్ సంచలనం

బంగారం ధరలను అనేక ప్రపంచం, దేశీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. సుంకాలపై ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక లోటులు ,డీడాలరైజేషన్, ట్రంప్ వాణిజ్య విధానాలు ,భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరల్లో పెరుగుదలను ప్రభావితం చేస్తున్నాయి. బంగారం ధరల పెరుగుదల , తగ్గుదల వంటివి అమెరికా వాణిజ్య విధానాలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ,ప్రపంచ మార్కెట్ కదలికలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రంగాలలో ఏవైనా ముఖ్యమైన మార్పులు జరిగితే బంగారం ధరలలో మరింత హెచ్చుతగ్గులకు దారితీయవచ్చు.