21 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్

21 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 700 దాటేసింది. మహారాష్ట్రలో 167, ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 56 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. అతి తక్కువగా యూపీలో రెండు, గోవా, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, మణిపూర్ లో ఒక్కో కేసు నమోదు అయింది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. మరోవైపు దేశంలో కొత్తగా 6వేల 358 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రికవరీ రేటు 98.40శాతానికి చేరుకుందని తెలిపారు అధికారులు. 

ఒమిక్రాన్ సహా కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోసారి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది కేంద్రప్రభత్వం. కంటెయిన్ మెంట్ చర్యలు తీసుకోవాలని సూచించింది. పండుగ సీజన్ లో జనం గుమిగూడకుండా చూసేందుకు ఆంక్షలు విధించాలని చెప్పింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ ను మరింత స్పీడప్ చేయాలని సూచించింది కేంద్రం. కొత్త వేరియంట్ విషయంలో మరింతగా అలర్ట్ గా ఉండాలని చెప్పింది.

కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. డెల్టా కంటే మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో కంటెయిన్ మెంట్ చర్యలకు సవాళ్లు విసురుతోందన్నారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. జిల్లాల స్థాయిలో జనవరి 31వరకు కంటెయిన్ మెంట్ మెజర్స్ అమలు చేయాలని... 144 సెక్షన్ ప్రయోగించాలని ఆదేశించింది కేంద్రం. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టాలని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లెటర్ రాశారు అని అజయ్ భల్లా.

ఒమిక్రాన్ వ్యాప్తితో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 5వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి 9గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. కర్నాటకలో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. యూపీలో ఈనెల 25 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అస్సాం, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్ లో కూడా ఆంక్షలు పెట్టారు.