24 గంటల్లో 774 కరోనా కేసులు .. 921 మంది డిశ్చార్జ్‌

24 గంటల్లో 774  కరోనా కేసులు ..  921 మంది డిశ్చార్జ్‌

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 2024 జనవరి 05  శుక్రవారం  ఒక్క రోజునే దేశవ్యాప్తంగా కొత్తగా 774  కరోనా కేసులు నమోదయ్యాయి.  తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,187గా ఉంది. నిన్న ఒక్కరోజే 921 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 

ఇక కరోనాతో గుజరాత్‌లో ఒకరు, తమిళనాడులో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 

మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 (JN.1) కేసులు 619 నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 199, కేరళలో 148, మహారాష్ట్రలో 110 వెలుగుచూశాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతూనే ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ లు ధరించాలని, శుభ్రత పాటించాలని చెబుతున్నారు. ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించిన వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని హెచ్చరిస్తున్నారు.