V6 News

భారత్‌ ఎప్పటికీ కమలంలా వికసించాలి

భారత్‌ ఎప్పటికీ కమలంలా వికసించాలి

భారత్‌ ఎప్పటికీ కమలంలా వికసించాలన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడున్న నిర్మలా సీతారామన్‌… ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్‌లో మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు.న్యూ ఇండియా, సబ్‌కాసాత్‌, సబ్‌కా వికాస్‌,  ప్రజా సంక్షేమం అనే మూడు లక్ష్యాలతో వెళ్తున్నామన్నారు. డిజిటల్‌ ఇండియాకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఈ బడ్జెట్‌లో అంత్యోదయ స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

ఆయుష్మాన్ భవ అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందన్నారు మంత్రి నిర్మలా సీతారామన్. నగదు బదిలీ పథకంతో నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బు వెళ్తుందన్నారు. ఈ ఏడాది జీఎస్టీ రిటర్న్స్ మరింత ఈజీ అయ్యిందన్నారు.

గత ఐదేళ్లలో  FDIలు ఎక్కువగా పెరిగాయన్నారు. 2014 – 2019 మధ్య కాలంలో ఎఫ్‌డిఐలు 119 బిలియన్‌ డాలర్లనుంచి 284 డాలర్లకు పెరిగాయని నిర్మయలా సీతారామన్ చెప్పారు. 2014 -2019 మధ్య కాలంలో 7.4 శాతం వృద్ధి రేటు సాధించామని అన్నారు.