
ఆమ్‌స్టెల్వీన్ (నెదర్లాండ్స్): విమెన్స్ హాకీ వరల్డ్ కప్‌ను ఇండియా డ్రాతో షురూ చేసింది. మేటి జట్టు ఇంగ్లండ్‌ను నిలువరించింది. పూల్–బిలో భాగంగా ఇండి యా, ఇంగ్లండ్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ 1–1తో డ్రా అయింది. ఆట మొదలైన ఎనిమిదో నిమిషంలోనే ఇంగ్లండ్‌కు ఇసాబెల్లా పెటర్ గోల్ అందించి 1–0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. అయితే, 28వ నిమిషంలో వందనా కటారియా చేసిన గోల్‌తో ఇండియా స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లూ ఎంత ప్రయత్నించినా మరో గోల్ రాలేదు. ఇండియా కెప్టెన్, గోల్ కీపర్ సవిత ప్రత్యర్థి దాడులను అద్భుతంగా నిలువరించింది. కానీ, చివర్లో లభించిన రెండు మూడు అవకా శాలను ఇండియా వదులుకుంది. దాంతో, టోక్యో ఒలింపిక్స్‌లో తమకు బ్రాంజ్ మెడల్‌ను దూరం చేసిన ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకోలేకపో యింది. మంగళవారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో చైనాతో ఇండియా పోటీ పడుతుంది.