అడవులు పెంచుట్ల తెలుగు రాష్ట్రాలే టాప్

 అడవులు పెంచుట్ల తెలుగు రాష్ట్రాలే టాప్
  • రెండో స్థానంలో తెలంగాణ, తర్వాత ఒడిశా
  • ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్’ రిలీజ్‌‌‌‌ చేసిన కేంద్రం
  • గడిచిన రెండేండ్లలో 2,261 చదరపు కిలో మీటర్ల మేర పెరుగుదల
  • తెలంగాణలో హరితహారం ప్రభావం అంతంతే

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: గడిచిన రెండేండ్లలో దేశంలో విస్తీర్ణపరంగా అడవులు బాగా పెరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌‌‌‌ టాప్ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. 647 చదరపు కిలోమీటర్ల(చ.కి) మేర పెరుగుదలతో ఏపీ మొదటి స్థానం దక్కించుకోగా, 632 చదరపు కిలోమీటర్లతో తెలంగాణ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 537 చ.కి పెరుగుదలతో ఒడిశా మూడో స్థానం సొంతం చేసుకుంది. దేశంలో చెట్లు, అటవీ వనరులను అంచనా వేస్తూ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వే ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా రూపొందించిన ‘ఇండియా స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2021’ను గురువారం కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి భూపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేశారు.17 రాష్ట్రాలు/యూటీలు భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతానికి పైగా అటవీ విస్తీర్ణం నమోదు చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 
రెండేండ్లలో 2,261 చ.కి. పెరుగుదల
రెండేండ్లలో దేశంలో 2,261 చదరపు కిలో మీటర్ల మేర అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందని ఫారెస్ట్ సర్వే రిపోర్టులో తేలింది. ఇందులో అడవుల విస్తీర్ణం1,540 చ.కి, చెట్ల విస్తీర్ణం721 చ.కి మేర పెరిగింది. కాగా దేశంలో మొత్తం 80.9 మిలియన్ హెక్టార్లలో అడవులు, చెట్లు ఉన్నాయి. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 24.62 శాతం. దేశంలో ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. తర్వాతి స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ఉన్నాయి. మొత్తం భౌగోళిక విస్తీర్ణంతో పోలిస్తే అటవీ విస్తీర్ణంలో మిజోరం(84.53%), అరుణాచల్ ప్రదేశ్(79.33%), మేఘాలయ(76%), మణిపూర్(74.34%), నాగాలాండ్(73.90%) రాష్ట్రాలు ఉన్నాయి. దాదాపు 17 రాష్ట్రాలు, యూటీలు 33 శాతానికి  పైగా అటవీ, చెట్ల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. 
నాటిన మొక్కలు..అడవి పెరుగుదల
రాష్ట్రం    2015-2020 మధ్య    2015లో    2021లో    2015-2021  మధ్య
    నాటిన మొక్కలు    ఫారెస్ట్​కవర్    ఫారెస్ట్​కవర్    పెరుగుదల 
    (కోట్లలో)    (చ.కి)    (చ.కి)    (చ.కి)
ఏపీ    73    26,006    29,784    3,778
కర్నాటక    19    36,449    38,730    2,281
కేరళ    2    19,278    21,253    1,975
ఒడిశా    44    50,460    52,156    1,696
తెలంగాణ    187    19,854    21,214    1360

హరితహారం ఫలితాలేవి?
దేశంలో ఏ రాష్ట్రంలో నాటనన్ని మొక్కలు నాటుతున్నా, తెలంగాణ ఫారెస్ట్ విస్తీర్ణం మాత్రం అంతంతగానే పెరుగుతోంది. రాష్ట్రంలో 2015 నుంచి 2020 వరకు187 కోట్ల మొక్కలు నాటినట్టు హరితహారం లెక్కలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమం కింద నాటిన మొక్కల్లో 85 శాతం బతికాయని ఇప్పటికి అనేకసార్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన మన రాష్ట్రంలో కనీసం ఓ పది వేల చదరపు కిలో మీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరగాల్సి ఉంది. కానీ, ఈ ఐదేండ్లలో1360 చదరపు కిలోమీటర్ల ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్తీర్ణం మాత్రమే పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇదే ఐదేండ్ల పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 73 కోట్ల మొక్కలు మాత్రమే నాటిన ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 3,778 చదరపు కిలోమీటర్ల మేర ఫారెస్ట్ కవర్ పెరిగింది. తెలంగాణతో పోలిస్తే అత్యంత తక్కువ మొక్కలు నాటిన కర్ణాటక, కేరళ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఫారెస్ట్ కవర్ మన కంటే చాలా ఎక్కువ పెరిగింది.