దేశంలో ఆత్మహత్యల సంక్షోభం : మహిళల కంటే మగాళ్లే ఎక్కువ.. సగటు సూసైడ్ వయస్సు 36 ఏళ్లు..

దేశంలో ఆత్మహత్యల సంక్షోభం : మహిళల కంటే మగాళ్లే ఎక్కువ.. సగటు సూసైడ్ వయస్సు 36 ఏళ్లు..

దేశంలో ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. ఆత్మహత్యలు చేసుకున్నవారిలో పురుషులే అధికంగా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 30నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారే అధికంగా ఉన్నారు. ఆత్మహత్యలకు ఒత్తిడి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) నివేదిక ప్రకారం..దేశంలో ప్రతి లక్ష మందిలో 10 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆత్మహత్యలలో 70శాతం పురుషులే ఉన్నారు.మహిళలతో పోలిస్తే పురుషులు మూడు రెట్లు ఎక్కువగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అత్యధికంగా 30నుంచి -40 ఏళ్ల వయస్సు గలవారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ALSO READ : మియాపూర్ లో నిర్మాణంలో ఉన్న ఇండ్లే టార్గెట్..

పురుషుల ఆత్మహత్య మరణాల రేటు ప్రతి లక్ష మంది పురుషులకు 12.8 కాగా, లక్ష మంది మహిళలకు 7.3గా ఉంది. పురుషుల ఆత్మహత్యలకు 18శాతం ఆర్థిక ఒత్తిడి కారణమైతే మహిళల ఆత్మహత్యలకు 33శాతం కుటుంబ కలహాలు కారణమవుతున్నట్లు సర్వేల్లే తేలింది. 

మానసిక ఆరోగ్య సమస్యలు..

నిరుద్యోగం ,ఆర్థిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, వైవాహిక సంబంధాలు తెగిపోవడం, మద్యం ,మత్తు పదార్థాలకు బానిసలై, పట్టణ జీవనశైలిలో ఒత్తిడి, ఒంటరితనం కారణంగా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని సర్వేల్లో తేలింది. ఉద్యోగాలు రాలేదని కొందరు ఆత్మహత్య చేసుకుంటే.. ఆర్థికంగా దివాళా తీసి ఇంకొందరు, కుటుంబ కలహాలు, వైవాహిక జీవితంలో కలతల కారణంగా మరికొందరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారని సర్వేల తేలింది. 

అస్సాం, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు ,ఉత్తరప్రదేశ్‌లలో తొమ్మిది రాష్ట్రాలలో ఈ సర్వే దాదాపు పదిలక్షల మందిని కవర్ చేసింది. జనవరి 2019 నుండి డిసెంబర్ 2022 వరకు తొమ్మిది రాష్ట్రాలలో 2లక్షల 40వేల 975 గృహాలలో సర్వే నిర్వహించారు. ఆత్మహత్యలతో మొత్తం 29వేల 273 మంది ప్రాణాలు తీసుకున్నట్లు లెక్కించారు. దేశంలో ఆత్మహత్య మరణాల రేటు లక్షకు 10గా ఉందని నివేదికలు చెబుతున్నాయి.