దుబాయ్: కరోనా బ్రేక్ తర్వాత టీమిండియా ఇంటర్నేషనల్ క్రికెట్ రీస్టార్ట్‌కు సంబంధించి తొలి అడుగు పడింది. ఐపీఎల్‌లో వివిధ జట్లకు ఆడిన ఇండియా క్రికెటర్లు నేషనల్ డ్యూటీకి రెడీ అయ్యారు. రెండు నెలలకుపైగా సాగే ఆస్ట్రేలియా పర్యటన కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలోని టీమ్ బుధవారం రాత్రి దుబాయ్ నుంచి సిడ్నీ బయలుదేరింది. ఐపీఎల్ ఫినిష్ చేసుకుని మంగళవారం రాత్రికే ఒక్కచోటకు చేరిన టీమిండియా క్రికెటర్లంతా ప్రత్యేకంగా డిజైన్ చేసిన పీపీఈ కిట్లు ధరించి ఫ్లైట్ ఎక్కారు.
ఆగస్టు చివరి వారం నుంచి యూఏఈలో బయో బబుల్‌లో గడిపిన క్రికెటర్లు.. ఆసీస్‌లో అడుగుపెట్టిన వెంటనే మళ్లీ బబుల్‌లోకి వెళ్లనున్నారు. కాగా, స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ మాత్రం ఇండియాకు తిరుగుపయనమయ్యాడు బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ అనంతరం టెస్ట్ సిరీస్ నాటికి ఆసీస్ చేరుకుంటాడు. గాయంతో బాధపడుతున్న సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా మాత్రం ఆసీస్ ఫ్లైట్ ఎక్కాడు. ఈ టూర్‌లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరుసగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి.
#TeamIndia is BACK!
Let's embrace the new normal ?#AUSvIND pic.twitter.com/csrQ3aVv21
— BCCI (@BCCI) November 11, 2020

