మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా ఆ జట్టుతో టీమిండియా మూడు టీ20ల్లో తలపడనుంది. సెప్టెంబర్‌లో ఇండియా వేదికగా ఈ సిరీస్ జరగనుంది. అలాగే, వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో నాలుగు టెస్టుల సిరీస్ కోసం కంగారూ టీమ్ ఇండియా టూర్‌కు రానుంది. ఇక, ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 9-19 మధ్య ఇండియా.. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అనంతరం ఐర్లాండ్ టూర్‌లో రెండు టీ20ల్లో, ఇంగ్లండ్ టూర్‌లో ఒక టెస్టుతో పాటు మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది.
