
- కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
బషీర్‌బాగ్,వెలుగు: పదేండ్లు భారత్ ఆర్థిక ప్రగతిలో దూసుకెళ్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్ లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీలో ఎడ్యుకేషన్ సొసైటీ 85వ ఫౌండేషన్ డేను శుక్రవారం నిర్వహించగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన గెస్ట్‌గా పాల్గొని మాట్లాడారు. కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్వాతంత్య్రం కంటే ముందు ఏర్పడిందని, స్వాతంత్రోద్యమంతోనూ ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు.
ఉన్నత ప్రమాణాలతో విద్య, విలువలను నేర్పుతున్న యాజమాన్యాన్ని అభినందించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ విద్యాసంస్థలకు దేశంలో గొప్ప ప్రత్యేకత ఉందన్నారు. ఇక్కడ ఇంజినీరింగ్ , లా కాలేజీల్లో అడ్మిషన్లు దొరకడం చాలా కష్టమన్నారు. భవిష్యత్ లో అమెరికా, ఆస్ట్రేలియా నుంచి చదువు కోసం మనదేశానికి వస్తారని, అందుకు కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ పనితీరు నిదర్శనమన్నారు. మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుంటోందన్నారు. అనంతరం కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రులు మెమోంటోలతో సన్మానించారు.