IND vs ENG 2025: ఘోరంగా విఫలమైన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌కు 311 పరుగుల భారీ ఆధిక్యం

IND vs ENG 2025: ఘోరంగా విఫలమైన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌కు 311 పరుగుల భారీ ఆధిక్యం

ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే. రెండో ఇన్నింగ్స్ లో అత్యద్భుతంగా ఆడితే భారత జట్టు డ్రా టెస్ట్ మ్యాచ్ ను డ్రా చేసుకోగలదు. మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో మన బౌలర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం సంపాదించింది. రూట్ (150), స్టోక్స్ (141) భారీ సెంచరీలతో విరుచుకుపడడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా, సుందర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, కంబోజ్ లకు ఒక వికెట్ దక్కింది.
 
7 వికెట్ల నష్టానికి 544 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 125 పరుగులు జోడించింది. ఆట ప్రారంభంలో  డాసన్ (26) వికెట్ తీసి బుమ్రా టీమిండియాకు శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత స్టోక్స్ (141), కార్స్ (47) జోడీ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా స్టోక్స్ భారీ షాట్స్ తో చెలరేగాడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరింతలా చెలరేగి జట్టు ఆధిక్యాన్ని శరవేగంగా పెంచాడు. మరో ఎండ్ లో కార్స్ (47) సైతం భారీ షాట్స్ ఆడుతూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఎట్టకేలకు వీరిద్దరి జోడీని జడేజా విడగొట్టాడు. 

ALSO READ : IND vs ENG 2025: మాంచెస్టర్ టెస్టులో విఫలం.. తొలిసారి బుమ్రా ఖాతాలో చెత్త రికార్డ్

ఒక భారీ షాట్ కు ప్రయత్నించినా స్టోక్స్.. జడేజా బౌలింగ్ లో సాయి సుదర్శన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 95 పరుగుల వీరిద్దరి భాగస్వామ్యానికి తెర పడింది. ఉన్నంత సేపు బ్యాట్ ఝులిపించిన కార్స్.. 47 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. మూడు రోజు రూట్ 150 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్లు క్రాలీ (84), డకెట్ (94) హాఫ్ సెంచరీలతో మంచి శుభారంభాలు ఇచ్చారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 358 పరుగులకు ఆలౌటైంది.