బెనోని (సౌతాఫ్రికా): యంగ్ సెన్సేషన్, ఇండియా అండర్-19 టీమ్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (24 బాల్స్‌లో 1 ఫోర్, 10 సిక్సర్లతో 68) మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 19 బాల్స్‌లోనే ఫిఫ్టీ చేసి సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. దాంతో సోమవారం జరిగిన రెండో యూత్ వన్డే మ్యాచ్‌లో ఇండియా 8 వికెట్ల తేడాతో (డక్‌వర్త్) సౌతాఫ్రికా అండర్-19 జట్టుపై ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
తొలుత సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 245 రన్స్‌కు ఆలౌటైంది. జాసన్ రౌల్స్ (114) సెంచరీతో మెప్పించగా.. కిషన్ సింగ్ 4, అంబరీష్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే, 12.5 ఓవర్లలో ఇండియా 115/2 స్కోరుతో నిలిచిన సమయంలో వర్షంతో ఆట ఆగింది. తిరిగి మొదలయ్యాక డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టార్గెట్‌ను 27 ఓవర్లలో 174 రన్స్‌గా సవరించగా.. ఇండియా 23.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
