కరోనాతో జాబ్స్ రద్దయిన వారికి గుడ్ న్యూస్

కరోనాతో జాబ్స్ రద్దయిన వారికి గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జాబ్ ఆఫర్స్ రద్దయిన స్టూడెంట్స్​ కోసం (ఐఐటీ) స్పెషల్ ప్లేస్ మెంట్ డ్రైవ్స్ నిర్వహించనుంది. బుధ‌వారం ఈ విష‌యాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. కొవిడ్–19 వల్ల జాబ్స్ క్యాన్సిల్ అయిన స్టూడెంట్స్​ కోసం స్పెషల్ ప్లేస్​మెంట్ డ్రైవ్స్ జరపాల్సిందిగా .. అన్ని ఐఐటీల డైరెక్టర్ లను కోరానన్నారు.

ప్లేస్ మెంట్ డ్రైవ్ ల్లో ఉద్యోగాలు సంపాదించిన స్టూడెంట్స్ చురుకైన మేధస్సు ఉన్నవారన్నారు. అలాంటి స్టూడెంట్స్ క్లిష్ట సమయాల్లో రిక్రూటర్లకు సాయపడతారన్నారు. క్యాంపస్ రిక్రూటర్లు గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్ల జాబ్ ఆఫర్లను వెనక్కి తీసుకోకుండా ఉండాలన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో కంపెనీల్లో అనిశ్చితి నెలకొనడంతో కొన్ని ఐఐటీలతో పాటు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్​మేనేజ్ మెంట్ (ఐఐఎం)లు స్టూడెంట్స్​ జాబ్ ఆఫర్లను రద్దు చేశాయి. దీంతో విద్యార్థుల క్యాంపస్ ప్లేస్ మెంట్​లపై ఎలాంటి ప్రభావం లేకుండా చూడాలని గతవారం 23 ఐఐటీల డైరెక్టర్ లకు కేంద్రమంత్రి సూచించారు.