
హైదరాబాద్ : 5 వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య..ఫస్ట్ వన్డే మార్చి-2న హైదరాబాద్ లో జరగనుంది. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు పోలీసులు. “ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. 2300 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసాం. 200 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం.ల్యాప్టాప్,మాచ్ బాక్స్,పెన్,పెర్ఫ్యూమ్, సిగరెట్లు, హెల్మెట్స్, వాటర్ బాటిల్ లను అనుమతించము. స్టేడియం పరిసరాల్లో భారీ బందోబస్తు. స్టేడియంలో 38000 మంది స్టేడియం కెపాసిటీ ఉంది అని తెలిపారు రాచకొండ కమీషనర్ మహేష్ భాగవత్.