
హైదరాబాద్ : టీమిండియాతో 5 వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ వన్డేలో టాస్ గెలిచింది ఆస్ట్రేలియా. కెప్టెన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చాహల్ కు విశ్రాంతినిచ్చి అల్ రౌండర్ జడేజాను టీమ్ లోకి తీసుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. న్యూజిలాండ్ లో ఆడిన టాప్ ఆర్డర్‌నే ఈ మ్యాచ్ లోనూ కొనసాగిస్తున్నట్లు విరాట్ వివరించాడు.
ఇప్పటికే టీ20 సిరీస్ ను కోల్పోయిన భారత్..వన్డే సిరీస్ లో తప్పక గెలువాలనే కసితో ఉంది. సొంతగడ్డపై గెలచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది. రెండు మ్యాచుల్లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన జోష్ మీదున్న ఆసిస్.. అదే జోరు కొనసాగించాలనే కాన్ఫిడెన్స్ తో ఉంది.
దీంతో రెండు టీమ్స్ ను తక్కువ అంచనా వేయలేము. మంచి ఫాంమీదున్న మ్యాక్స్ వెల్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేస్తే భారత్ కి గెలిచే అవకాశాలుంటాయి. హైదరాబాద్ లో జరుగున్న ఈ మ్యాచ్ ను చూడటానికి క్రికెట్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
టీమ్స్ వివరాలు..
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, బుమ్రా
ఆస్ట్రేలియా: అరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, మార్కస్ స్టాయినీస్, హాండ్స్ కాంబ్, మాక్స్‌వెల్, టర్నర్, అలెక్స్ కేరీ, నాథన్ కౌల్టర్ నైల్, పాట్ కమిన్స్, జంపా, బెహ్న్రెండార్ఫ్
1st ODI. Australia win the toss and elect to bat https://t.co/MaGLAXFqZP #IndvAus
— BCCI (@BCCI) March 2, 2019