నిలబెట్టిన కోహ్లీ : ఆస్ట్రేలియా టార్గెట్-251

నిలబెట్టిన కోహ్లీ : ఆస్ట్రేలియా టార్గెట్-251

నాగ్ పూర్ : సెకండ్ వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. కెప్టెన్ విరాట్ కెహ్లీ మరోసారి సత్తా చూపించాడు. ఒంటరి పోరాటం చేసి.. భారత్ కు గౌరవప్రధమైన స్కోర్ అందించాడు. ఇవాళ నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న సెకండ్ వన్డేలో.. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 48 ఓవర్లలో  250 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.

మ్యాచ్ ప్రారంభంలోనే రోహిత్, ధావన్, రాయుడు ఓట్ కావడంతో..భారత్ రన్ రేట్ తగ్గింది. తర్వాత వచ్చిన కోహ్లీ, విజయ్ శంకర్ స్పీడ్ గా ఆడారు. అయితే శంకర్(46) రన్ అవుట్ రూపంలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత జాదవ్, ధోనీ వెంటనే ఔట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్. ఈ క్రమంలో ఆచితూచి ఆడాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. జడేజాతో కలిసి స్కోర్ ను పెంచాడు. వన్డేలో 40వ సెంచరీ చేసిన విరాట్..మొత్తం (116) రన్స్ తో రాణించాడు. దీంతో భారత్ 250 రన్స్ తో గౌరవప్రధమైన స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ముందు చాలెంజింగ్ టార్గెన్ ను ముందు ఉంచింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో..ఆడమ్ జంపా(2), ప్యాట్ కమిన్స్(4), మ్యాక్స్ వెల్, (1), లిన్,(1) కౌల్టర్ నిల్(1) వికెట్లు తీశారు.