రాంచీ వన్డే : భారత్ టార్గెట్-314

రాంచీ వన్డే : భారత్ టార్గెట్-314

రాంచీ : భారత్ తో 5 వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ రాంచీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసిస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 313 రన్స్ చేసింది. ఆస్ట్రేలియాకు మంచి ప్రారంభం దక్కడంతో భారీ స్కోర్ దిశగా కనిపించింది. అయితే ఫించ్, మ్యాక్స్ వెల్ ఔట్ కావడంతో రన్ రేట్ తగ్గింది. భారత్ బౌలర్ కుల్దీప్ మరోసారి తన సత్తా చాటాడు. 3 వికెట్లు ఒక్క రన్ ఔట్ చేసి, ఆసిస్ ను కట్టడి చేశాడు.

ఆస్ట్రేలియా ప్లేయర్లలో.. ఖవాజా 104, ఫించ్(93), మ్యాక్స్ వెల్(47), స్టోయినిస్(31), క్యారీ(21) రన్స్ తో రాణించారు.

భారత బౌలర్లలో..కుల్దీప్ యాదవ్(3), షమీ(1) వికెట్లు దక్కాయి.