
హైదరాబాద్ : ఐదే ఐదు మ్యాచ్ లు..! ఇంగ్లండ్ లో వరల్డ్ కప్ కు ముందు టీమిండియా కేవలం ఐదు అంతర్జా తీయ వన్డేల్లోనే పోటీపడనుంది..! ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ తోనే వరల్డ్ కప్ లో పాల్గొ నే జట్టును పూర్తి గా సిద్ధం చేసుకోవాలి..! ఆసీస్ తో టీ20 సిరీస్ లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలి..! అంతేకాదు.. హైదరాబాద్ గడ్డపై యాభై ఓవర్ల ఫార్మాట్ లో కంగారులపై నెగ్గని చెత్త రికార్డును బద్దలు కొట్టా లి..! మరి ప్రపంచకప్ కు ప్రీ ఫైనల్ సిరీస్ గా.. ఆశావాహులకు చివరి ఆడిషన్ గా కనిపిస్తున్న ఆసీస్ తో పోరులో కోహ్లీసేన అదరగొడుతుందా? హైదరాబాద్‌లో నేడే తొలి వన్డే..! భాగ్యనగరంలో గెలుపు భాగ్యం ఎవరిదో మరి..!
ప్రపంచకప్ సన్నాహాల్లో ఉన్న టీమిండియా ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం తొలి వన్డే ఆడనుంది. వరల్డ్ కప్ ముందు జరిగే ఆఖరి సిరీస్ కావడంతో ఆ మెగా టోర్నీలో ఆడే జట్టు ఎంపికపై ఉన్న సందిగ్ధతను తొలగించేందుకు ఈ సిరీస్ లో పలు ప్రయోగాలు చేసే అవకాశముంది. ఆస్ట్రేలియా చేతిలో సొంతగడ్డపై టీ20 సిరీస్ లో 0–2తో ఓడినప్పటికీ ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ కోహ్లీసే నకు వరల్డ్‌కప్ రిహార్సల్ లా ఉపయోగపడనుంది. ఆ నలుగురికి అగ్నిపరీక్ష ఈ సిరీస్ లో ప్రతి మ్యాచ్ లో విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచటం ఖాయం. అయితే అంతకంటే ముఖ్యం గా టీమిండియాలో నలుగురు ప్లేయర్లకు ఈ వన్డే సిరీస్ అగ్ని పరీక్షగా మారింది. సత్తా చూపెడితే కచ్చితంగా వరల్డ్‌కప్ బెర్త్ దొరికేందుకు ఈ వన్డే సిరీస్ కీలకంగా మారటంతో ప్లేయర్లంతా ఈ వన్డేలకు సమరోత్సాహంతో సిద్ధమవుతున్నారు.
ఇంగ్లండ్ లో జరిగే ప్రపంచకప్ లో ఆడే జట్టు ఇప్పటికే ఖరారైనప్పటికీ 15 మందిలో చివరి రెండు స్థా నాల కోసం రాహుల్ , రిషబ్ పంత్ , విజయ్ శంకర్, సిద్ధా ర్థ్ కౌల్ లు తీవ్రంగా పోటీపడుతున్నారు. నలుగురితో పాటు వన్డే జట్టులో లేనప్పటికీ దినే శ్ కార్తీ క్ కూడా వరల్డ్ కప్ బెర్త్‌పై ఆశలుపెట్టు్కుని ఎదురు చూస్తున్నాడు. అయితే ఆస్ట్రేలియాతోజరిగే ఈ వన్డేలు రాహుల్ , పంత్ , శంకర్, కౌల్ కు లిట్మస్ టెస్ట్‌గా మారాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20ల్లో రాహుల్ 50,47 రన్స్‌తో రాణించి ఫామ్ లో కొచ్చానంటూసెలెక్టర్లకు సిగ్నల్ పంపాడు. టీ 20ల్లో రాణించడంతో రాహుల్ టాపార్డర్‌లో మరికొన్ని మ్యాచ్ లు అడే అవకాశం సొంతం చేసుకున్నట్టే . శిఖర్ ధవన్ ఫామ్ ఎప్పుడెలా ఉంటుందో ఊహించటం కష్టమే కనుక రిజర్వ్ ఓపెనర్ ప్లేస్ రే స్ లో ఉన్న రాహుల్ కు అడ్వాం టేజ్ అయింది. అదే సమయంలో మిడిలార్డర్‌లో నూ ఆడగలిగే సామర్థ్యం అతనికి ప్లస్ పాయింట్ . ఒకవేళ లోకేశ్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని భావిస్తే.. లోకల్ స్టార్ అంబటి రాయుడును పక్కనబెట్టాల్సి ఉంటుంది. ఇక అందరి దృష్టి రిషబ్ పంత్ పైనే ఉంది. నిలకడగా ఆడలేకపోతున్నప్పటికీ, ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించే సామర్థ్యం ఉండటంతో పంత్ కు ఈ సిరీస్ లో అవకాశమివ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ చూస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న టీమిండియా ప్లేయర్లు శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ ఆడారు. ఎలాగైనా గెలవాలని ప్రాక్టీస్ చేశారు.
టీమ్స్ (అంచనా)
ఇండియా: రోహిత్ , ధవన్, కోహ్లీ , రాహుల్ /రాయుడు, జాదవ్ , ధోనీ, శంకర్, కుల్దీప్ , షమి,చహల్ , బుమ్రా.
ఆస్ట్రేలియా: ఫించ్ , ఖవాజా, హాండ్స్‌కోంబ్ , స్టొయినిస్ , మ్యాక్స్‌వెల్ , టర్నర్, అలెక్స్ కారీ, జంపా, కమిన్స్, బెరెన్‌డార్ఫ్ , జే రిచర్డ్‌సన్.
Snapshots from training session on 1st ODI eve in Hyderabad #TeamIndia #INDvAUS @Paytm pic.twitter.com/o2244oniTl
— BCCI (@BCCI) March 1, 2019