మూడో టెస్టుకు సిద్ధమవుతున్న టీమిండియాకు షాక్ తగిలింది. ఓపెనర్, రిజర్వ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చివరి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. రాహుల్ ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడ్ని ఆఖరి రెండు మ్యాచ్‌ల సెలెక్షన్ నుంచి తప్పించారు. ఈ నెల 2న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రాహుల్‌కు ఈ గాయమైందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. కోలుకోవడడానికి అతడికి మూడు వారాల సమయం పడుతుందని స్పష్టం చేసింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రాహుల్ ట్రీట్‌మెంట్ తీసుకోనున్నాడు.
UPDATE: KL Rahul ruled out of Border-Gavaskar Trophy.
More details ? https://t.co/G5KLPDLnrv pic.twitter.com/S5z5G3QC2L
— BCCI (@BCCI) January 5, 2021

