పాక్ పై కోపంతో ధోనీ కష్టపడి భారత్ ను ఓడించాడు

పాక్ పై కోపంతో ధోనీ కష్టపడి భారత్ ను ఓడించాడు

బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమికి బ్యాట్స్‌మన్‌లు ఎంఎస్ ధోనీ-కేదార్ జాదవ్‌లే కారణమంటూ అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 338 రన్స్ టార్గెట్ తో ఓపెనర్ రాహుల్ త్వరగానే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ రోహిత్‌ శర్మ సెంచరీతో, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (76) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ ఔట్ అయినా.. రోహిత్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. ధోనీ అండతో హార్దిక్‌ పాండ్యా( 45) 4 బౌండరీలతో ఊపు తెచ్చాడు. చివరకు పాండ్యా భారీ షాట్ కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ధోనీ జిడ్డు బ్యాటింగ్ తో రన్ రేట్ పెరుగుతూ వచ్చింది.

భారత్ 30 బాల్స్ లో 71 రన్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దశలో క్రీజులో ఉన్న ధోనీ, జాదవ్‌ లు హిట్టింగ్ చేయకుండా.. సింగిల్స్‌పైనే దృష్టిపెట్టారు. కొన్నిసార్లు బాల్ ని బ్యాట్‌ కు కనీసం తాకించలేక పోయారు. మిడిల్ ఓవర్స్ తరహాలో సింగిల్స్‌ తీస్తూ ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించారు. ధోనీ-జాదవ్‌లు 7 డాట్‌ బాల్స్, 20 సింగిల్స్, 3 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టారు. మ్యాచ్ చూసే భారత అభిమానులు అయితే ఇగ షాట్ ఆడుతాడు అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసారు. అయినా స్లో బ్యాటింగ్‌ తో విసుగు తెప్పించారు.

చేతిలో ఐదు వికెట్ల ఉండి కూడా భారీ షాట్లకు ప్రయత్నించకపోవడం ఆశ్యర్యానికి గురిచేసిందని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. వీరి బ్యాటింగ్ చూసి అబిమానులు కాదు కామెంటేటర్‌ లు కూడా ఆశ్చర్యపోయారు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ నాసర్‌ హుస్సెన్‌ అయితే ఈ బ్యాటింగ్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ కూడా ఈ జోడిని తప్పుబట్టాడు. వీరి ఆట చూసి ఓడిపోతామని ఫిక్స్ అయి కొందరు అభిమానులు మైదానంను కూడా వీడారు. అయితే పాక్ పై ఉన్న కోపంతో ధోనీ కష్టపడి ఇండియాను ఓడించాడు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.