పంత్ సూపర్ సెంచరీ.. పట్టు బిగిస్తున్న భారత్

పంత్ సూపర్ సెంచరీ.. పట్టు బిగిస్తున్న భారత్

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ సెంచరీతో భారత్ దూసుకెళ్తోంది. 24/1 తో రెండో రోజు బ్యాటింగ్‌‌ను కొనసాగించిన టీమిండియా ఐదో రోజు ముగిసేసరికి  7 వికెట్ల నష్టానికి 294 రన్స్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (49) ఆకట్టుకోగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (101) అద్వితీయ శతకంతో మ్యాచ్‌‌ను ములుపు తిప్పాడు.

ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే చటేశ్వర్ పుజారా (17) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ డకౌటై మరోమారు నిరాశపర్చాడు. అనంతరం క్రీజులో అడుగు పెట్టిన వైస్ కెప్టెన్ రహానె (27) నిలదొక్కుకున్నట్లే కనిపించినా స్టోక్స్ బౌలింగ్‌‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరడంతో భారత శిబిరంలో ఆందోళన పెరిగింది. ఇంగ్లండ్‌‌లాగే టీమిండియా కూడా తక్కువ స్కోరుకే చాప చుట్టేస్తుందా అనే అనుమానాలు కలిగాయి. కానీ పంత్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (60 బ్యాటింగ్)లు కలసి టీమిండియాను ఒడ్డుకు చేర్చారు. హాఫ్ సెంచరీ అనంతరం పంత్ మెరుపు షాట్లతో అలరించాడు. సిక్సర్‌‌తో సెంచరీ చేసి వహ్వా అనిపించాడు. ప్రస్తుతం భారత్ 89 రన్స్‌‌ లీడ్‌‌లో కొనసాగుతోంది. స్కోరు బోర్డుపై ఎంత ఎక్కువ పరుగులు చేరితే ఇంగ్లండ్‌‌పై ఒత్తిడి అంతగా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది.