T20 World Cup: భారత్– న్యూజిలాండ్ మధ్య రాజుకుంటున్న వేడి.. స్టేడియంలో ఇక యుద్ధమే!

T20 World Cup: భారత్– న్యూజిలాండ్ మధ్య రాజుకుంటున్న వేడి.. స్టేడియంలో ఇక యుద్ధమే!

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ స్టేజీకి వచ్చింది. ఈ రోజు ( మార్చి 8న) రాత్రి 7 గంటల నుంచి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఫైట్ స్టార్ట్ కానుంది. ఈ మహా సంగ్రామం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే, ఫైనల్ మ్యాచ్ కి రిజర్వ్ డే ఉంది. కానీ, వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు అహ్మదాబాద్ లో వర్షం కురిసే ఛాన్స్ లేదని పేర్కొన్నారు. 

ఈరోజు పగటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల సమయంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే ఛాన్స్ ఉందన్నారు. అర్ధరాత్రి ఉష్ణోగ్రతలు 28 నుంచి 27 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితులు పవర్ ప్లేను మరింత ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి! 

భారత జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, శివమ్ దూబె, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షీప్ సింగ్

న్యూజిలాండ్ జట్టు (అంచనా): టిమ్ సెఫర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జాకబ్ డఫీ, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మ్యాట్ హెన్రీ, లూకీ ఫెర్గూసన్.