World Championship of Legends: క్రికెట్ లవర్స్‌కు మళ్లీ వింటేజ్ కిక్ ఇచ్చేందుకు 'వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్' (WCL) రెడీ అయిపోయింది. ఈ క్రేజీ లీగ్ మూడో సీజన్ అక్టోబర్ 2026లో అఫీషియల్‌గా రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. గత రెండు సీజన్ల భారీ సక్సెస్ సాధించిన తర్వాత.. 'లెజెండ్స్ వరల్డ్ కప్'గా గుర్తింపు తెచ్చుకున్న ఈ టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెట్ ఆటగాళ్లు, అలాగే గ్లోబల్ టీ20 లీగ్స్‌లో దుమ్మురేపుతున్న యాక్టివ్ ప్లేయర్స్ మరోసారి ఒకే వేదికపైకి రాబోతున్నారు.
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య రచ్చ:
గత సీజన్ (WCL 2025)లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన వివాదం అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియన్ ప్లేయర్స్, స్పాన్సర్లపై నెట్టింట విమర్శలు రావడంతో.. పాకిస్తాన్ తో ఆడేందుకు మన ఆటగాళ్లు ససేమిరా అన్నారు. దీంతో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత సెమీఫైనల్‌లోనూ భారత్ తప్పుకోవడంతో పాకిస్తాన్ డైరెక్ట్‌గా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరి ఈ అక్టోబర్‌లో జరగబోయే సీజన్-3లో ఈ రైవల్రీ మ్యాచ్ ఉంటుందా లేదా అనేది కంప్లీట్ సస్పెన్స్ గా మారింది.
కొత్త టీమ్ ఎంట్రీ.. టోటల్‌గా 7 జట్లతో:
ఈ 3వ సీజన్‌లో టైటిల్ వేట కోసం మొత్తం ఏడు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో పాటు ఈసారి కొత్తగా బంగ్లాదేశ్ ఛాంపియన్స్ కూడా ఎంట్రీ ఇస్తోంది. తమ బోర్డులతో సెంట్రల్ కాన్ట్రాక్ట్ లేని క్రేజీ టీ20 ప్లేయర్స్, రిటైర్డ్ లెజెండ్స్ ఈ టీమ్స్‌లో ఉండటంతో మ్యాచ్‌లు ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది.
అజయ్ దేవగన్ ఏమన్నాడంటే?:
ఈ లీగ్ కంబ్యాక్ గురించి WCL ఫౌండర్ అండ్ సీఈఓ హర్షిత్ తోమర్ మాట్లాడుతూ.. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా, ఫ్యాన్స్‌కు ఒక అద్భుతమైన సెలబ్రేషన్ ఫీలింగ్ ఇవ్వడమే తమ టార్గెట్, కాబట్టి సీజన్ 3 సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ లీగ్ కో-ఓనర్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ స్పందిస్తూ.. "WCL అనేది కేవలం క్రికెట్ లీగ్ కాదు.. ఇదొక ప్యూర్ ఎమోషన్, నోస్టాల్జియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ల డెడ్లీ కాంబినేషన్.. సీజన్ 3 కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్, ఇది మా మోస్ట్ బోల్డెస్ట్ సీజన్ కాబోతోందని హైప్ ఇచ్చాడు.
పిక్చర్ ఇంకా బాకీ ఉంది:
అక్టోబర్‌లో షురూ కాబోయే ఈ క్రేజీ టోర్నమెంట్‌కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్, టీమ్ స్క్వాడ్స్, మ్యాచ్‌లు జరిగే వెన్యూస్ గురించి అఫీషియల్ బ్రాడ్‌కాస్ట్ పార్ట్‌నర్స్ వివరాలను రాబోయే రోజుల్లో WCL అనౌన్స్ చేయనుంది. పాత రైవల్రీలను రీక్రియేట్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్ ఇచ్చేందుకు లెజెండ్స్ అందరూ నెట్స్‌లో గట్టిగానే ప్రాక్టీస్ మొదలెట్టేస్తున్నారు.
The wait is OVER. WCL Season 3 coming this October. The greatest legends are BACK again.🔥 #wcl #wcl2026 #warofchampions #legends #cricket pic.twitter.com/0sWIgl86XX
— World Championship Of Legends (@WclLeague) May 28, 2026
