IND vs PAK: మళ్లీ జూన్ 14న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. 

IND vs PAK: మళ్లీ జూన్ 14న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. 

IND vs PAK: ఇంగ్లాండ్ వేదికగా జూన్ 14వ తేదీ నుంచి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ని ఐసీసీ రిలీజ్ చేసింది. ఈ మెగా టోర్నమెంట్ ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ తో స్టార్ట్ కానుంది. భారత్ తన మొదటి మ్యాచ్ ని పాక్ తో జూన్ 14వ తేదీన ఆడనుంది. ఫైనల్ మ్యాచ్ జులై 5వ తేదీన లార్డ్స్ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 12 టీమ్స్ పాల్గొనున్నాయి.

ఈ ప్రపంచకప్ టోర్నమెంట్ మొత్తం రెండు గ్రూపులుగా జట్లు విడిపోయి తలపడనున్నాయి. గ్రూప్– 1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉండనుండగా.. గ్రూప్– 2లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ పోటీ పడతాయి.  

ఈ వరల్డ్ కప్ లో పాల్గొనే 12 జట్లు ఇవే:

1. ఆస్ట్రేలియా
2. దక్షిణాఫ్రికా
3. భారత్ 
4. పాకిస్థాన్ 
5. ఇంగ్లాండ్ 
6. న్యూజిలాండ్, 
7. శ్రీలంక, 
8. వెస్టిండీస్, 
9. బంగ్లాదేశ్ 
10. ఐర్లాండ్, 
11. స్కాట్లాండ్
12. నెదర్లాండ్స్