ఇండియా ఎవరి ముందూ మోకరిల్లదు.. EFTA ఒప్పందంతో 84 లక్షల కోట్ల పెట్టుబడులు.. అత్యధిక ఎగుమతులతో వృద్ధి

ఇండియా ఎవరి ముందూ మోకరిల్లదు.. EFTA ఒప్పందంతో 84 లక్షల కోట్ల పెట్టుబడులు.. అత్యధిక ఎగుమతులతో వృద్ధి

టారిఫ్స్ పేరుతో ఇండియను నయానో భయానో లొంగదీసుకోవాలనుకుంటున్న యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రయత్నాలను ఇండియా తిప్పి కొడుతోంది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను ఆపేయాలని.. లేదంటే డబుల్ టారిఫ్ లు తప్పవని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇండియా ఎవరి దగ్గర నుంచి ఏం దిగుమతి చేసుకోవాలో అమెరికా నిర్దేశించలేదని ఇప్పటికే స్పష్టం చేసిన ఇండియా.. లేటెస్టుగా.. ఇండియా ఎవరి ముందు మోకరిల్లదని గట్టి సమాధానం పంపింది. 

ట్రంప్ ఆర్డర్స్ ను లెక్క చేయకుండా ఇప్పటికే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్  కొనుగోలును కొనసాగిస్తోంది ఇండియా. ఈ సందర్భంగా ఇండియా ఎవరి ముందు తల వంచదని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం (ఆగస్టు 08) బిజినెస్ టుడే @100 సమ్మిట్ లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇండియా ఎగుమతులు, దిగుమతులపై ఎవరూ ప్రభావం చూపలేరని అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇప్పటికే భారత్ 6.5 శాతం వృద్ధితో ఈ ఏడాది అత్యధిక ఎగుమతులతో ముందుకు వెళ్తోందని చెప్పారు. అమెరికా లాంటి దేశాల టారిఫ్స్, సాంక్షన్స్ కారణంగా వాణిజ్యంలో డీ గ్లోబలైజేషన్ అవుతోందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఒక దేశం సాంక్షన్స్ విధిస్తే దేశాల పార్టనర్ షిప్ మారుతుందని అన్నారు. ఇప్పటి వరకు ఉన్న దేశాల పార్టనర్షిప్ మారి.. ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటాయని తెలిపారు. 

►ALSO READ | Raksha Bandhan: సరిపోయింది.. 2 రూపాయల రాఖీని ఇలా చేసి 50, 100 రూపాయలకు అమ్ముతున్నారా..?

ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పురోగతిలో ఉందని చెప్పారు గోయల్. EFTA (యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్) దేశాలు ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ తుది దశకు చేరుకుందని తెలిపారు. ఇండియా 4 ట్రిలియన్ ఎకానమీ అని,, అత్యధిక యూత్ ఉన్న దేశం అని అన్నారు .EFTA దేశాలు ఇండియాలో 87 లక్షల కోట్ల పెట్టుబడులకు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో లక్షల సంఖ్యలు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి EFTA  దేశాల ఒప్పందం కార్యరూపం దాల్చుతుందని.. అక్కణ్నుంచి ఈ దేశాల మధ్య వాణిజ్యం మరింత సులువుగా మారుతుందని తెలిపారు.