
వెల్లింగ్టన్ వన్డేలో భారత్ జట్టు విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా ఆధిక్యాన్ని 4-1కు పెంచుకుంది. 253 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాట్స్ మెన్ 217 పరుగులకే అలౌటయ్యారు. దీంతో భారత్ 35 పరుగులతో విజయంతో సాధించింది. చౌహాల్ మూడు వికెట్లు తీసి కివీస్ నడ్డివిరిచారు. షమి, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీశారు.
లాస్ట్ వన్డేలో టాప్ ఆర్డర్ విఫలమైనా…మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ ఆదుకోవడంతో టీమిండియా 252 పరుగులు చేసింది. 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను అంబటి రాయుడు, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. రాయుడు 113 బంతుల్లో 4 సిక్స్ లు, 8 ఫోర్లతో 90 రన్స్ చేశాడు. అయితే చివర్లో పరుగుల సునామీ సృష్టించిన పాండ్యా కేవలం 22 బంతుల్లో 5 సిక్స్ లు, 2 ఫోర్లతో 45 రన్స్ చేశాడు. ఆల్ రౌండర్ విజయ్ శంకర్ మరోసారి పర్వాలేదనిపించాడు. విజయ్ 64 బాల్స్ లో 4 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. రాయుడుతో కలిసి ఐదో వికెట్ కు 98 పరుగులు జోడించి టీమ్ ను ఆదుకున్నాడు విజయ్ శంకర్. ఆ తర్వాత కేదార్ జాదవ్ 34 రన్స్ చేశాడు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ 2, ధావన్ 6, శుభ్ మాన్ గిల్ 7, ధోనీ 1 రన్స్ తో విఫలమయ్యారు.
Game Over! #TeamIndia clinch the final ODI by 35 runs and wrap the series 4-1 #NZvIND ???? pic.twitter.com/2cRTTnS8Ss
— BCCI (@BCCI) February 3, 2019