దేశం కొత్త చరిత్ర సృష్టించింది.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాబోయే తరాలు చర్చించాలి

దేశం కొత్త చరిత్ర సృష్టించింది.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాబోయే తరాలు చర్చించాలి

సెప్టెంబర్ 22న దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. పార్లమెంట్ ఉభయ సభల్లో 'నారీ శక్తి వందన్ అధినియం' (మహిళా రిజర్వేషన్ బిల్లు)ను ఆమోదించిన మరుసటి రోజు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర కార్యాలయం వద్ద ప్రధానమంత్రికి మహిళా పార్టీ కార్యకర్తలు (మహిళా మోర్చా సభ్యులు), నాయకులు స్వాగతం పలికారు.

"ఈ రోజు నేను దేశంలోని మహిళలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న, అంతకు ముందు రోజు, మనం ఒక కొత్త చరిత్ర సృష్టించడాన్ని చూశాము. ఆ చరిత్రను సృష్టించే అవకాశాన్ని కోట్లాది మంది ప్రజలు అందించడం మా అదృష్టం" అని ప్రధాని మోదీ ప్రసంగించారు. "భారతదేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలను నేను అభినందిస్తున్నాను. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో మనం కొత్త చరిత్ర సృష్టించడం చూశాం. ఈ చరిత్ర సృష్టించడానికి ప్రజలు మాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం మా అదృష్టం" అని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన శక్తి వందన్-అభినందన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్నారు. .

"రాబోయే తరాలు ఈ నిర్ణయం గురించి చర్చించుకుంటాయి. పార్లమెంటులో 'నారీ శక్తి వందన్ అధినియం' మెజారిటీతో ఆమోదించబడినందుకు నేను దేశాన్ని అభినందిస్తున్నాను" అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. “దేశంలో సంపూర్ణ మెజారిటీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంత పెద్ద పనిని పూర్తి చేయగలిగాం.. మహిళా రిజర్వేషన్ల ముందు ఎవరి స్వార్థం లేదు. దృఢ నిశ్చయమైన ప్రయత్నాలు ఎన్నటికీ విఫలం కావు. ప్రజలు బిల్లుకు ఓటు వేశారు కానీ 'నారీ శక్తి వందన్' అనే పదాన్ని ఎందుకు తీసుకువచ్చారు అని కొంతమందికి అసౌకర్యం కలిగిస్తోంది. దేశంలోని మహిళలకు సలాం చేయకూడదా? అలానే ఉండాలా? 'నారీ శక్తి వందన్'పై ఇంకా అసంతృప్తిగా ఉన్నారా?" అని ఆయన అన్నారు.

ALSO READ : అష్టదిగ్భంధనం మూవీ రివ్యూ: ట్విస్టులతో మైండ్ బ్లాక్ అవడం ఖాయం!

"ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనేక అడ్డంకులు ఉన్నాయి. కానీ ఉద్దేశాలు స్వచ్ఛంగా, ప్రయత్నాలలో పారదర్శకత ఉన్నప్పుడు, అన్ని అడ్డంకులను అధిగమించి ఫలితాలు సాధిస్తాం. ఈ బిల్లుకు పార్లమెంటులో ఇంత మద్దతు లభించడం ఒక రికార్డు. అందుకు నేను అన్ని రాజకీయ పార్టీలకు, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని మోదీ అన్నారు. "నారీ శక్తి వందన్ అధినియం సాధారణ చట్టం కాదు, ఇది నవ భారతదేశం కొత్త ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనం" అని ప్రధాని చెప్పారు.