అష్టదిగ్భంధనం మూవీ రివ్యూ: ట్విస్టులతో మైండ్ బ్లాక్ అవడం ఖాయం!

అష్టదిగ్భంధనం మూవీ రివ్యూ: ట్విస్టులతో మైండ్ బ్లాక్ అవడం ఖాయం!

నటుడు సూర్య భరత్ చంద్ర(Surya bharatha chandra), విషిక కోట(Vishika koda), విశ్వేందర్ రెడ్డి(Vishwendar reddy), మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా అష్టదిగ్భంధనం(Ashtadigbandhanam ). థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? నటీనటులు ఎలా చేశారు? ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? అనేది ఈ రివ్యూలో చూదాం.

కథ: రౌడీ షీటర్ శంకర్. తన తోటి రౌడీ రాజకీయ నాయకుడిగా మారి తనను అవమానిస్తాడు.  దీంతో ఈగో దెబ్బతిన్న శంకర్ తాను కూడా ఎలాగైనా ఎమ్మెల్యే కావాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం అధికార పార్టీకి  రూ.50 కోట్లు చెల్లించేందుకు కూడా సిద్ధపడతాడు శంకర్. మరి ఆ రూ.50 కోట్ల కోసం శంకర్ ఎం చేశాడు? దానికి హీరోహీరోయిన్లకు సంబంధం ఏంటి? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ: జరుగుతున్న ఈ యుద్ధం రాజ్యం కోసమో, రాణి కోసమే కాదని.. ఇద్దరు వ్యక్తుల అహం వల్ల జరుగుతున్నదని ట్రైలర్‌లో చూపించిన విధంగానే.. సినిమాలో కనిపించింది. దర్శకుడు బాబాకు ఇది రెండో సినిమా అయినప్పటికీ.. స్కీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. ఫస్ట్ హాప్ అంతా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోయింది. అంతేకాదు కొన్ని క్యారెక్టర్స్ సస్పెన్స్ క్రియేట్ చేశాయి. వాటికి సెకెండాఫ్‌లో ఇచ్చిన కన్‌క్లూజన్ కూడా బాగుంది. ఆ కక్రమంలో వచ్చే ట్విస్ట్స్ సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. సెకెండాఫ్ లో ఒక్కో సీన్ ఉత్కంఠగా మారుతూ.. తరువాత ఎం జరుగుతుంది అనే ఆసక్తిని ఆసక్తిని పెంచింది. ఇక అక్కడక్కడా కొన్ని లాజిక్స్‌ను మిస్ చేసినా..  ఓవరాల్‌గా సినిమా మాత్రం చాలా బాగుందనే చెప్పాలి.

ALSO READ : IND vs AUS: ఎలాంటి ఛార్జీలు లేకుండా.. ఫ్రీగానే లైవ్ మ్యాచ్ ఇక్కడ చూసేయండి

నటీనటులు: సినిమాలో హీరోగా నటించిన సూర్య భరత్ చంద్ర నటనలో పరవాలేదనిపించాడు. హీరోయిన్ విషిక తన గ్లామర్ తో ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసింది. అంతేకాదు తన నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఇక రౌడీ షీటర్ శంకర్ పాత్ర, మంత్రి పాత్రలతో పాటు మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. 

ఇక మొత్తంగా చెప్పాలంటే.. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి అష్టదిగ్భంధనం తప్పకుండా నచ్చుతుంది.