స్మృతి మంధాన పెండ్లి.. వరుడి బ్యాక్ గ్రౌండ్ తక్కువ లేదుగా..!

స్మృతి మంధాన పెండ్లి.. వరుడి బ్యాక్ గ్రౌండ్ తక్కువ లేదుగా..!

న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ వైస్‌‌ కెప్టెన్‌‌ స్మృతి మంధాన పెండ్లి పీటలు ఎక్కనుంది.  తాను చాన్నాళ్లుగా ప్రేమిస్తున్న మ్యూజిక్ కంపోజర్‌‌, సింగర్ పలాష్‌‌ ముచ్చల్‌‌ను పెండ్లి చేసుకోనుంది. ఈ నెల 23న ఈ ఇద్దరి మ్యారేజ్ జరగనుంది. మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగే ఈ గ్రాండ్‌‌ వెడ్డింగ్‌‌కు సినీ, క్రికెటర్‌‌ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది.

ఇరు కుటుంబాలు పెండ్లికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయాయి. నెల కిందటే ఇండోర్‌‌లో ఈ ఇద్దరి ఎంగేజ్‌‌మెంట్‌‌ జర్గగా.. ఈ విషయాన్ని స్మృతి ఇన్‌‌స్టా పోస్టులో ఇటీవలే వెల్లడించింది. స్మృతి– పలాష్‌‌ వెడ్డింగ్‌‌ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌ అవుతోంది.