
రాంచీ: ఎఫ్‌ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఇండియా విమెన్స్ హాకీ టీమ్ కీలక విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన పూల్–బి రెండో మ్యాచ్‌లో ఇండియా 3–1తో న్యూజిలాండ్‌పై నెగ్గింది. దీంతో పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫై ఆశలను సజీవంగా ఉంచుకుంది.
సంగీతా కుమారి (1వ ని.), ఉదిత (12వ ని.), డుంగ్ డుంగ్ బ్యూటీ (14వ ని.) ఇండియాకు గోల్స్ అందించారు. హుల్ మేఘన్ (9వ ని.) కివీస్ తరఫున ఏకైక గోల్ చేసింది. ఆరంభం నుంచి మంచి సమన్వయంతో ఆడిన ఇండియా ఫార్వర్డ్స్ కీలక టైమ్‌లో గోల్స్‌తో ఆకట్టుకున్నారు. మంగళవారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఇండియా.. ఇటలీతో తలపడుతుంది.