Women's ODI World Cup 2025: ఇండియా, సౌతాఫ్రికా ఫైనల్.. మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందా.. రద్దయితే విజేత ఎవరంటే..?

Women's ODI World Cup 2025: ఇండియా, సౌతాఫ్రికా ఫైనల్.. మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందా.. రద్దయితే విజేత ఎవరంటే..?

మహిళల వరల్డ్ కప్ ఫైనల్ 2025కు రంగం సిద్ధమైంది. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించినా ఇండియా, సౌతాఫ్రికా జట్లు ఫైనల్ ఆడనున్నాయి. ఆదివారం (నవంబర్ 2) జరగనున్న ఈ గ్రాండ్ ఫైనల్ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతుంది. ఇప్పటివరకు ఒకసారి కూడా టైటిల్ గెలవని రెండు జట్లు తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో  రెండుసార్లు ఫైనల్ కు వచ్చి ఓడిపోతే.. సౌతాఫ్రికా తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ లో అడుగుపెట్టింది. మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరో ఇప్పుడు చూద్దాం.. 

మహిళల వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించారు. అందువల్ల మ్యాచ్ రోజు వర్షార్పణం అయినా.. ఆ మరుసటి రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. ఆదివారం (నవంబర్ 2)న జరగబోయే ఫైనల్ జరగకపోతే సోమవారం (నవంబర్ 3) మ్యాచ్ ను నిర్వహిస్తారు. మ్యాచ్ జరిగి మధ్యలో ఆగిపోతే అక్కడ వరకు మ్యాచ్ ను వదిలేసి రిజర్వ్ డే రోజు మళ్ళీ మొదటి నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ కుదించబడినట్టయితే తర్వాత రోజు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి ప్రారంభమవుతుంది.  ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా ఫలితం రాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

ఫైనల్ జరగబోయే డివై పాటిల్ స్టేడియంలో వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ రిపోర్ట్స్ ప్రకారం ఫైనల్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ టోర్నమెంట్ లో ఈ స్టేడియంలో జరిగిన చాలా మ్యాచ్ లు వర్షం కారణంగా ఫలితం రాలేదు. లీగ్ స్టేజ్ లో ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్‌కు పలు మార్లు వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పై ఇండియా ఆడిన లీగ్ మ్యాచ్ కూడా ఫలితం రాకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. గెలిచిన జట్టు ఛేజింగ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వర్షం ముప్పు ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ప్రభావం బౌలర్లకు ప్రతికూలంగా మారనుంది.