న్యూఢిల్లీ: రాణి రాంపాల్ కెప్టెన్సీలోని ఇండియా విమెన్స్ హాకీ టీమ్ ఆదివారం అర్జెంటీనా టూర్‌కు బయలుదేరింది. కరోనా వల్ల వచ్చిన ఏడాది బ్రేక్ తర్వాత జరుగుతున్న ఈ టూర్‌తో ఇండియా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్‌ను రీస్టార్ట్ చేయనుంది. టోక్యో ఒలింపిక్స్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ టూర్‌లో.. ఇండియా, అర్జెంటీనాతో నాలుగు మ్యాచ్‌లు (జనవరి 26, 28, 30, 31 తేదీల్లో) ఆడనుంది. అంతకుముందు అర్జెంటీనా జూనియర్స్, బీ టీమ్స్‌తో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇండియా టీమ్‌కు అర్జెంటీనా గవర్నమెంట్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో ప్లేయర్లంతా నేరుగా హోటల్‌కు వెళ్లనున్నారు.కానీ లోకల్ గవర్నమెంట్‌ప్రోటోకాల్స్ పాటించి తీరాలి.

