ఉప్పల్​లో సూర్యకుమార్​, కోహ్లీ మెరుపులు

ఉప్పల్​లో సూర్యకుమార్​, కోహ్లీ మెరుపులు
  • 2–1 తేడాతో ఆసీస్​పై సిరీస్‌‌‌‌ గెలిచిన ఇండియా

హైదరాబాద్​ గడ్డపై టీమిండియానే బాద్​షా అయింది.  ఉప్పల్ స్టేడియంలో ఖతర్నాక్​ ఆటతో  ఆస్ట్రేలియాపై పంజా విసిరింది. సూర్యకుమార్​యాదవ్​ (36 బాల్స్​లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69), విరాట్ కోహ్లీ ( 48 బాల్స్​లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63) ఫోర్లు, సిక్సర్ల మోతమోగిస్తూ.. భాగ్యనగర క్రికెట్ అభిమానులకు కిక్​ ఇచ్చిన వేళ మూడో టీ20లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో టీ 20 వరల్డ్​ కప్ ఆడనున్న రోహిత్​సేన  ఇప్పుడు ఆ జట్టును ఓడించి కాన్ఫిడెన్స్​ పెంచుకుంది. అదే సమయంలో టికెట్ల కోసం ఎన్నో ఇక్కట్లు పడ్డ హైదరాబాద్​ ఫ్యాన్స్​ఇండియా ఆట చూసి ఆ బాధలన్నీ మర్చిపోయి ఖుషీ అయ్యారు..!

ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో చివరి బాల్​ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో టీమిండియా విక్టరీ  సాధించింది. ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌‌‌‌లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (36 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69), విరాట్‌‌‌‌ కోహ్లీ (48 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63) దంచికొట్టారు. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను రోహిత్‌‌‌‌ సేన 2–1తో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఆసీస్‌‌‌‌ ఏడు వికెట్లు కోల్పోయి 186 రన్స్​ చేసింది. ఆసీస్​ బ్యాట్​మెన్​ కామెరూన్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ (21 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54) హాఫ్‌‌‌‌ సెంచరీలు చేశారు.  ఇండియా బౌలర్​ అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ 3 వికెట్లతో కంగారూలను కట్టడి చేశాడు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇండియా 4 వికెట్ల కోల్పోయి టార్గెట్​ను చేధించింది.  ‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు:  ఇండియా, ఆస్ట్రేలియా టీ20 పోరుకు భాగ్యనగరంలో అద్భుత ముగింపు దక్కింది. సూర్యకుమార్, కోహ్లీ ఖతర్నాక్​ ఆటతో ఆదివారం రాత్రి ఉప్పల్​ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. దాంతో మూడు మ్యాచ్​ల సిరీస్​ను 2–-1తో సొంతం చేసుకుంది. మొదట ఆసీస్​ 20 ఓవర్లలో 186/7 స్కోరు చేసింది. కామెరూన్​ గ్రీన్​ (21 బాల్స్​లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), టిమ్​ డేవిడ్​ (27 బాల్స్​లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54) ఫిఫ్టీలు కొట్టగా.. డానియల్ సామ్స్​ (28 నాటౌట్​), జోష్​ ఇంగ్లిస్ (24) రాణించారు. అనంతరం సూర్య, కోహ్లీతో పాటు చివర్లో హార్దిక్​ పాండ్యా (16 బాల్స్​లో 2 ఫోర్లు, 1 సిక్స్​తో 25 నాటౌట్) సత్తా చాటడంతో ఇండియా 19.5 ఓవర్లలో 187/4 స్కోరు చేసి గెలిచింది. సూర్యకుమార్​కు ‘ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్’​,  అక్షర్​కు ‘ప్లేయర్​ ఆఫ్​ ద సిరీస్’​ అవార్డులు దక్కాయి. 

గ్రీన్, టిమ్​ కమాల్

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆసీస్​కు  గ్రీన్​ మెరుపు ఆరంభం ఇచ్చాడు.  దీంతో నాలుగో ఓవర్లలోనే కంగారూ టీమ్​ యాభై రన్స్​ చేసింది.  భువనేశ్వర్ (1/39) ​ బౌలింగ్​లో తన తొలి రెండు బాల్స్​ను 6,4 గా మలచిన అతను భారీ షాట్లతో చెలరేగాడు. అక్షర్​ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన అతను బుమ్రా (0/50) కు ఫోర్, రెండు సిక్సర్లతో స్వాగతం పలికాడు. క్రీజులో ఇబ్బంది పడ్డ ఫించ్​ (7)ను నాలుగో ఓవర్లో  ఔట్​ చేసిన అక్షర్​ బ్రేక్​ ఇచ్చినా.. గ్రీన్​ హ్యాట్రిక్​  ఫోర్లు బాదాడు. అయితే, 19 బాల్స్​లో హాఫ్​ సెంచరీ చేసిన గ్రీన్​ను ఐదో ఓవర్లో  భువీ తన మార్కు స్వింగర్​తో పెవిలియన్​కు చేర్చాడు. అక్కడి నుంచి ఇండియా బౌలర్లు పుంజుకున్నారు. పాండ్యా (0/23)  బౌలింగ్​లో స్మిత్​(9) ఇచ్చిన క్యాచ్​ను బ్యాక్​వర్డ్​​ పాయింట్​లో  డ్రాప్​ చేసిన అక్షర్​.. చహల్​(1/22)  వేసిన 8వ ఓవర్లో సూపర్​త్రో కొట్టి మ్యాక్స్​వెల్​ (6)ను రనౌట్​చేసి తన తప్పును సరిదిద్దుకున్నాడు. ఆపై, ఊరించే బాల్‌‌తో  స్మిత్​ను స్టంపౌంట్​ చేసిన  చహల్ ఆసీస్​ను మరో దెబ్బకొట్టాడు.

దాంతో, పవర్​ ప్లేలో 66/2తో ఉన్న కంగారూ టీమ్​ సగం ఓవర్లకు  86/4తో నిలిచింది. ఓ ఎండ్​లో  నిలకడగా ఆడిన ఇంగ్లిస్ ​12 ఓవర్లలో స్కోరు వంద దాటించాడు. అతనికి తోడైన డేవిడ్​.. హర్షల్​(1/18)  బౌలింగ్​లో భారీ సిక్సర్​తో ఇన్నింగ్స్​కు మళ్లీ ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ14వ ఓవర్లో మళ్లీ బౌలింగ్​కు వచ్చిన అక్షర్ ఐదు బాల్స్​ తేడాతో ఇంగ్లిస్ తో పాటు డేంజర్​ మ్యాన్​ మాథ్యూ వేడ్​ (1)ను ఔట్​ చేసి రెండే రన్స్​ ఇచ్చాడు. దాంతో ఆసీస్​ 117/6తో నిలిచింది.   హార్దిక్​ బౌలింగ్ లో సామ్స్​ సిక్స్​, డేవిడ్​ ఫోర్​ కొట్టి జోరందుకున్నారు. భువీ వేసిన 18వ ఓవర్లో టిమ్​ డేవిడ్​ వరుసగా 6,6, 4తో చెలరేగి 21 రన్స్​ రాబట్టాడు. బుమ్రా బౌలింగ్​లో ఫస్ట్​ బాల్​కే సామ్స్​ సిక్స్​ కొట్టగా.. మూడో బాల్​కు డబుల్​,  హార్దిక్​ ఓవర్​ త్రో బౌండ్రీ దాటడంతో ఆరు రన్స్​ వచ్చాయి. లాస్ట్​ బాల్​ను కూడా సామ్స్​ బౌండ్రీ దాటించాడు. హర్షల్​వేసిన ఆఖరి ఓవర్​ తొలి బాల్​నే సిక్స్​ కొట్టిన టిమ్​ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ,  మూడో బాల్​కు మరో షాట్​ కొట్టి రోహిత్​కు క్యాచ్​ఇవ్వడంతో ఏడో వికెట్​కు 68 రన్స్​ పార్ట్​నర్​షిప్​ ముగిసింది. 

విరాట్,  సూర్య ప్రతాపం

భారీ టార్గెట్​ ఛేజింగ్​లో ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. సామ్స్​ వేసిన ఫస్ట్​ ఓవర్లోనే  ఓపెనర్ రాహుల్​ (1) కీపర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరగ్గా.. రెండు ఫోర్లు, ఓ సిక్స్​తో జోరు చూపెట్టిన కెప్టెన్​ రోహిత్​(17).. కమిన్స్ (1/40) ​ వేసిన నాలుగో ఓవర్లో పుల్​ షాట్​కు ట్రై చేసి క్యాచ్​ ఔటయ్యాడు. ఈ దశలో కోహ్లీ, సూర్యకుమార్​ ఆసీస్​ బౌలర్లపై ఎదురు దాడికి దిగి ఇన్నింగ్స్​ను చక్కదిద్దారు. హేజిల్​వుడ్​ (1/40) వేసిన ఆరో ఓవర్లో 6,4తో కోహ్లీ ఊపందుకోగా.. మ్యాక్స్​వెల్​ (0/11) బౌలింగ్​లో సూర్య 4, 4తో గేర్‌‌ మార్చాడు. స్పిన్నర్​ జంపా (0/44) వేసిన తొమ్మిదో ఓవర్లో విరాట్​ లాంగాన్​ మీదుగా అద్భుత సిక్సర్​ కొట్టాడు. ఆపై సామ్స్​షార్ట్​ బాల్​ను లాంగాఫ్​ మీదుగా స్టాండ్స్​కు పంపిన సూర్య.. కమిన్స్​ బౌలింగ్​లోనూ మరో భారీ సిక్స్​ బాదడంతో  11 ఓవర్లకు స్కోరు వంద దాటింది.   జంపా వేసిన  13వ ఓవర్లో  పవర్​ ఫుల్​ షాట్లతో వరుసగా రెండు సిక్సర్లు బాదిన తను 29 బాల్స్​లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. హేజిల్​వుడ్​ బౌలింగ్​లో 4, 6 రాబట్టిన అతను మరో భారీ షాట్​కు  ట్రై చేసి  ఫించ్​కు క్యాచ్​ ఇవ్వడంతో మూడో వికెట్​కు 104 రన్స్​ పార్ట్​నర్​షిప్​ బ్రేక్​ అయింది.   

చివర్లో టెన్షన్

కోహ్లీ, పాండ్యా క్రీజులో ఉన్నా  వరుసగా 17 బాల్స్​లో ఒక్క బౌండ్రీ రాకపోవడంతో ఇండియాపై కాస్త ఒత్తిడి పెరిగింది. చివరి 18  బాల్స్​లో  హోమ్​ టీమ్​కు 32 రన్స్​ అవసరం అవగా.. కమిన్స్​ వేసిన 18వ  ఓవర్లో పాండ్యా ఫోర్​ సహా 11  రన్స్​ వచ్చాయి. తర్వాతి ఓవర్లో అతను సిక్స్​ బాదాడు. ఇక సామ్స్​ వేసిన లాస్ట్ ఓవర్లో 11 రన్స్​ అవసరం అవగా.. తొలి బాల్​నే లాంగాన్​ మీదుగా స్టాండ్స్​ చేర్చిన కోహ్లీ తర్వాతి బాల్​కు ఎక్స్​ట్రా కవర్​ లో  ఫించ్​కు క్యాచ్​ ఇచ్చాడు. మూడో బాల్​కు కార్తీక్​ (1 నాటౌట్) రన్​ తీయగా.. నాలుగో బాల్​ డాట్​ అయింది. అయితే, ఐదో బాల్​ పాండ్యా బ్యాట్ ఎడ్జ్​ తీసుకొని బౌండ్రీ చేరడంతో ఇండియా గెలిచింది. ​

స్టేడియంలో వీఆర్ఏ నిరసన

ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని  ఖమ్మం జిల్లాకు చెందిన వీఆర్ఏ అజయ్ నిరసన తెలిపారు. టీ20 మ్యాచ్ చూసేందుకు వచ్చిన వీఆర్ఏ అజయ్ స్టేడియంలో ప్లకార్డు ప్రదర్శించారు. రాష్ట్రంలో ఉన్న 23 వేల మంది VRA ల తరపున నిరసన తెలిపినట్లు అజయ్. చెప్పారు