IND vs PAK: ఎవరితో ఆడినా వీరికి పరాజయాలే: ఉతప్ప ధనాధన్ ఇన్నింగ్స్.. ఇండియా చేతిలో ఓడిన పాకిస్థాన్

IND vs PAK: ఎవరితో ఆడినా వీరికి పరాజయాలే: ఉతప్ప ధనాధన్ ఇన్నింగ్స్.. ఇండియా చేతిలో ఓడిన పాకిస్థాన్

ప్రపంచ క్రికెట్ లో టీమిండియాపై ఎక్కడ మ్యాచ్ జరిగినా పాకిస్థాన్ జట్టుకు ఓటములు ఎదురవుతున్నాయి. సీనియర్, జూనియర్ మెన్స్ జట్లతో పాటు భారత మహిళల జట్టుతో ఆడినా పాకిస్థాన్ కు పరాజయాలు తప్పడం లేదు. తాజాగా హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీలో భాగంగా టీమిండియాపై పాక్ ఓడిపోయింది.  శుక్రవారం (నవంబర్ 7) పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 2 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్ రాబిన్ ఉతప్ప విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.   

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.ఓపెనర్ రాబిన్ ఉతప్ప 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 28 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ కీపర్ చిప్లి 13 బంతుల్లోనే 24 పరుగులు చేసి రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షెహజాద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్ లో పాకిస్థాన్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం పడడంతో మ్యాచ్ జరగలేదు. 

వర్షం ఇంతకీ తగ్గకపోవడంతో డక్ వార్త లూయిస్ పద్దతిలో భారత జట్టుకు 2పరుగులతో తేడాతో విజయాన్ని సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు. బిన్నీ ఒకే ఓవర్ వేసి 7 పరుగులు ఇచ్చి పాకిస్థాన్ ను కట్టడి చేశాడు. ఈ ఏడాది పాకిస్థాన్ భారత సీనియర్ మెన్స్ జట్టుతో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ లో మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్ టోర్నీలో భారత మహిళలపై పాకిస్థాన్ మహిళలు ఓడిపోయారు. తాజాగా హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీలోనూ పాకిస్థాన్ పై భారత జట్టు ఆధిపత్యం చూపించడం విశేషం.