Mi-17 ప్రమాదవశాత్తు కూలింది: ఐఏఎఫ్

Mi-17 ప్రమాదవశాత్తు కూలింది: ఐఏఎఫ్

శ్రీనగర్: ఇవాళ ఉదయం కశ్మీర్ లో కూలిన Mi-17 పై భారత వాయుసేన క్లారిటీ ఇచ్చింది. జమ్ము కశ్మీర్ లోని బుద్గాం జిల్లా గారెండ్ కలాన్ గ్రామంలో వాయుసేన హెలికాప్టర్ ఎంఐ-17 వీ5 ప్రమాదవశాత్తు కూలిందని తెలిపింది. ఉదయం 10.10 గంటల సమయంలో రొటీన్ ఆపరేషన్స్ లో భాగంగా పహారా కాస్తుండగా ఈ ఘటన జరిగిందని వివరించింది. ఇందులో ఉన్న ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పింది. ప్రమాదం జరగడానికి కారణాలపై విచారణ జరుగుతోందని వాయుసేన తెలిపింది.

బుధవారం ఉదయం ఎంఐ-17 కూలిన సమయంలో బుద్గాం జిల్లా అధికారులు ప్రమాదాన్ని ధ్రువీకరించారు. అయితే ఇది ఎవరిదన్న విషయంపై క్లారిటీ లేదని, విచారణ తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా, ఎంఐ-17 కూలడంతో తమకు ఎటువంటి సంబంధం లేదని పాక్ స్పష్టం చేసింది. భారత్ వైపు యుద్ధ విమానం కూలిందని రిపోర్ట్ వస్తున్నాయని, అయితే దాన్ని తాము కూల్చలేదని చెప్పింది. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.