హెలికాప్టర్​కు డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

హెలికాప్టర్​కు డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేతక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెలికాప్టర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోషిస్తున్నదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఏండ్లుగా సేవలందిస్తున్న చేతక్.. ఓ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా కాకుండా యుద్ధ వీరుడిలా పోరాడుతోందన్నారు. చేతక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 60 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హకీంపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో డైమండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూబ్లీ సెలబ్రేషన్స్​ నిర్వహించారు. శామీర్​పేటలోని నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ అకాడమీ(ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ)లో శనివారం జరిగిన వేడుకల్లో డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎయిర్ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్షల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌదరీ పాల్గొన్నారు.

భీకర యుద్ధ సమయాల్లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేవీలో చేతక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విశేష సేవలందించిందని రాజ్​నాథ్​సింగ్​ అన్నారు. ఒక హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నారంటేనే దాని గొప్పతనమేంటో అర్థమవుతోందన్నారు. చేతక్ చూడ్డానికి చిన్నగా ఉన్నా చేతల్లో భయానక వాతావరణం సృష్టించగలదని చెప్పారు. అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులు చేతక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ అధికారులను రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్ అభినందించారు. సూర్యకిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చేతక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెలికాప్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.