యాంటీట్యాంక్ గైడెడ్ మిస్సైల్ .. పరీక్ష సక్సెస్విజయవంతంగా పరీక్షించిన ఆర్మీ

యాంటీట్యాంక్  గైడెడ్  మిస్సైల్  .. పరీక్ష సక్సెస్విజయవంతంగా పరీక్షించిన ఆర్మీ

న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన, మనిషి మోసుకెళ్లగలిగే యాంటీట్యాంక్  గైడెడ్  మిస్సైల్(ఎంపీఏటీజీఎం) వ్యవస్థను భారత ఆర్మీ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ రీసెర్చ్  అండ్  డెవలప్ మెంట్  ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) ఈ ఆయుధ వ్యవస్థను డిజైన్  చేసి డెవలప్ చేసింది. లాంచర్లు, టార్గెట్  ఆక్విజిషన్  డివైజ్, ఒక ఫైర్ కంట్రోల్  యూనిట్ ఈ వెపన్  సిస్టమ్​లో ఉంటాయి.

 ఈ నెల 13న పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్​లో ఎంపీఏటీజీఎం ఆయుధ వ్యవస్థ ఫ్లైట్ ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించామని ఆర్మీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మిసైల్, వార్ హెడ్ల  పనితీరు ఆశించినంతమేర ఉందని చెప్పారు.  పగటి పూట, రాత్రిపూట కూడా పనిచేసేలా ఈ ఆయుధ వ్యవస్థను తీర్చిదిద్దామని వెల్లడించారు. డుయెల్ మోడ్ సీకర్ ఫీచర్​తోఈ మిసైల్​కు అదనపు సామర్థ్యం కూడా చేకూరుతుందని పేర్కొన్నారు.

ఈ ఆయుధ వ్యవస్థకు సంబంధించి టెక్నాలజీ డెవలప్ మెంట్, పనితీరు పూర్తయ్యాయని, త్వరలోనే దీనిని ఆర్మీలో చేరుస్తామని అధికారులు వివరించారు. ఎంపీఏటీజీఎం ఆయుధ వ్యవస్థ ట్రయల్స్​ను విజయవంతంగా నిర్వహించినందుకు డీఆర్డీఓ, ఆర్మీకి రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్  అభినందనలు తెలిపారు. అడ్వాన్స్  టెక్నాలజీ బేస్డ్ డిఫెన్స్  సిస్టం డెవలప్ మెంట్​లో స్వయంసమృద్ధి సాధించేందుకు ముందడుగు పడిందని ఆయన పేర్కొన్నారు.