ఇండియన్ ఆర్మీలో ఎన్సీసీ పోస్టులు.. పెళ్లి కాని వారికీ మంచి ఛాన్స్..

ఇండియన్ ఆర్మీలో ఎన్సీసీ పోస్టులు.. పెళ్లి కాని వారికీ మంచి ఛాన్స్..

ఇండియన్ ఆర్మీ నేషనల్ క్యాడెట్ కార్ఫ్స్ ​(ఎన్​సీసీ) స్పెషల్ ఎంట్రీ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ పోస్టులకు వివాహం కాని మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.  అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 11.

పోస్టుల సంఖ్య: 06 ఎన్​సీసీ స్పెషల్ ఎంట్రీ (వివాహం కాని మహిళలు).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీతోపాటు ఎన్​సీసీలో గ్రేడ్–బి, గ్రేడ్–సి సర్టిఫికెట్ పొంది ఉండాలి.

వయోపరిమితి: 19 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 12.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 11.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, అకడమిక్, ఎన్​సీసీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.