ఇండియా చేతికి ఇగ్లా ఎస్ మిసైల్స్

ఇండియా చేతికి ఇగ్లా ఎస్ మిసైల్స్

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత సంక్షోభ సమయంలో వాడేందుకు వీలుగా భారత్‌‌ స్వల్ప శ్రేణి ఎయిర్‌‌ డిఫెన్స్‌‌ వ్యవస్థలను సిద్ధం చేస్తోంది. కొన్నాళ్ల క్రితమే రష్యాలో తయారు చేసిన ఇగ్లా-ఎస్‌‌ మిసైల్స్ ను ఇండియా దిగుమతి చేసుకొంది. ఈ షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్స్ వైమానిక రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. 

దాదాపు రూ.260 కోట్ల వ్యయంతో వీటిని కొనుగోలు చేశారు. ముఖ్యంగా పశ్చిమ సెక్టార్​లో సరిహద్దుల వద్ద వాడేందుకు ఇవి అత్యంత అనువుగా ఉంటాయి.1990 నుంచి భారత్‌‌ లో అందుబాటులో ఉన్న ఇగ్లా  మిస్సైల్ కు ఇది అడ్వాన్స్ డ్ వెర్షన్.