T20 World Cup: ఫైనల్ మ్యాచులో భారత కెప్టెన్ సూర్య గోల్డెన్ డక్

T20 World Cup: ఫైనల్ మ్యాచులో భారత కెప్టెన్ సూర్య గోల్డెన్ డక్

గాంధీ నగర్: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తీవ్రంగా నిరాశపర్చాడు. పరుగుల ఖాతా తెరవకుండానే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 16 ఓవర్లో ఇషాన్ కిషన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన స్కై.. నీషమ్ బౌలింగ్‎లో షాట్ ఆడిబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. 

కీలకమైన ఫైనల్ మ్యాచులో కెప్టెన్ డకౌట్ కావడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వరల్డ్ కప్‎లో ఒక్క అమెరికాపై ఇన్నింగ్స్ తప్పితే బ్యాటర్‎గా సూర్య చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. సూర్య డకౌట్ అయినప్పటికీ ఫైనల్ మ్యాచులో భారత బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు. 

ఆట ఆరంభం నుంచే న్యూజిలాండ్ బౌలర్లను ఊతకోత కోస్తున్నారు. ఓపెనర్స్ అభిషేక్ శర్మ (52), సంజు శాంసన్ (89), ఇషాన్ కిషన్ (52) మెరుపులు మెరిపించడంతో ఇండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.