గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌గా రాహుల్‌‌‌‌

గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌గా రాహుల్‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా చెస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ రాహుల్‌‌‌‌ వీఎస్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ హోదాను సాధించాడు. దాంతో దేశం తరఫున ఈ ఘనత సాధించిన 91వ ప్లేయర్‌‌‌‌గా నిలిచాడు. ఫిలిప్పీన్స్‌‌‌‌లో జరిగిన ఆసియన్‌‌‌‌ ఇండివిడ్యువల్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో మరో రౌండ్‌‌‌‌ మిగిలి ఉండగానే టైటిల్‌‌‌‌ గెలవడంతో రాహుల్‌‌‌‌కు గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ హోదా ఖాయమైంది. 2021లో ఇంటర్నేషనల్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ (ఐఎమ్‌‌‌‌) టైటిల్‌‌‌‌ను సాధించిన 21 ఏళ్ల రాహుల్‌‌‌‌ 2400 లైవ్‌‌‌‌ రేటింగ్‌‌‌‌ మార్క్‌‌‌‌ను అందుకోవడానికి ముందే నాలుగు, ఐదో ఐఎమ్‌‌‌‌లను సొంతం చేసుకున్నాడు. 

‘రౌండ్‌‌‌‌ మిగిలి ఉండగానే ఆసియా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ను సాధించినందుకు, అలాగే 91వ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌గా నిలిచినందుకు హృదయపూర్వక అభినందనలు. మీరు మరిన్ని మైలురాళ్లు సాధించాలని కోరుకుంటున్నా. చెస్‌‌‌‌లో ఇండియా గర్వపడేలా చేయడంలో మీ పాత్ర ఉండాలని ఆశిస్తున్నా’ అని ఆలిండియా చెస్‌‌‌‌ సమాఖ్య ప్రెసిడెంట్‌‌‌‌ నితిన్‌‌‌‌ నారంగ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌లో పోస్ట్‌‌‌‌ చేశాడు.