
భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్(గ్రూప్–ఏ గెజిటెడ్ ఆఫీసర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల పురుష అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 23.
- పోస్టుల సంఖ్య: 170
- పోస్టులు: జనరల్ డ్యూటీ(జీడీ) 140, టెక్నికల్(ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్) 30.
- ఎలిజిబిలిటీ
- జనరల్ డ్యూటీ(జీడీ): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ వరకు గణితం, భౌతికశాస్త్రం చదివి ఉండాలి. డిప్లొమా తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులే. అయితే, డిప్లొమా స్థాయిలో గణితం, భౌతికశాస్త్రం సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
- టెక్నికల్(ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నావల్ ఆర్కిటెక్చర్ లేదా మెకానికల్ లేదా మెరైన్ లేదా ఆటోమోటివ్ లేదా మెకట్రానిక్స్ లేదా ఇండస్ట్రియల్ లేదా ప్రొడక్షన్ లేదా మెటలార్జీ లేదా డిజైన్ లేదా ఏరో నాటికల్ లేదా ఏరోస్పేస్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఇనుస్ట్రుమెంటేషన్ లేదా ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా పవర్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
- వయోపరిమితి: 2026, జులై 1 నాటికి 21 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. (2001, జులై 01 నుంచి 2005, జూన్ 30 మధ్యలో జన్మించిన వారై ఉండాలి). ఇండియన్ కోస్ట్ గార్డ్ లేదా త్రివిధ దళాల్లో పనిచేసిన అభ్యర్థులకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐందేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్లు ప్రారంభం: జులై 08.
- లాస్ట్ డేట్: జులై 23.
- అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.300.
- సెలెక్షన్ ప్రాసెస్: ఐదంచెల సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టేజ్–I ( కోస్ట్‌గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్(సీజీసీఏటీ), స్టేజ్–II(ప్రిలిమినరీ సెలెక్షన్ బోర్డ్), స్టేజ్–III(ఎఫ్ఎస్బీ), స్టేజ్–IV
- (మెడికల్ ఎగ్జామినేషన్), స్టేజ్–V(ఇండక్షన్) తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. పూర్తి వివరాలకు joinindiancoastguard.cdac.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.
కోస్ట్‌గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (సీజీసీఏటీ)
స్టేజ్–I ఆబ్జెక్టివ్ బేస్డ్ కోస్ట్‌గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లిష్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్నకు నాలుగు మార్కులు. ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు 100 మార్కులకు, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 25 ప్రశ్నలు 100 మార్కులకు, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 100 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు 100 మార్కులకు మొత్తం 400 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.