బాబోయ్.. ధనశ్రీ వర్మ అరాచకం.. చాహల్‪ను పొగుడుతున్న నెటిజెన్స్!

బాబోయ్.. ధనశ్రీ వర్మ అరాచకం.. చాహల్‪ను పొగుడుతున్న నెటిజెన్స్!

టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ గురుంచి తెలియని అభిమాని ఉండరు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ధనశ్రీ.. ఎప్పటికప్పుడూ తన అభిరుచులను, అందాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఈ అమ్మడు తాజాగా మరోసారి తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. వీటిని చూసిన నెటిజెన్స్ చాహల్‪ను పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రేమ.. పెళ్లి 

చాహల్, ధనశ్రీ వర్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక డ్యాన్స్ నేర్చుకునేందుకు ధనశ్రీని ఆశ్రయించానని చాహల్.. ఆమెను మాయమాటలతో పడేశాడు. ఆపై ప్రొపోజ్ చేసి.. మూడు ముళ్ల బంధంతో తన సొంతం చేసుకున్నాడు. అలా అందమైన భామను తన వశం చేసుకున్నందుకే నెటిజెన్స్.. చాహల్‪ను పొగుడుతున్నారు. నువ్ చాలా అదృష్టవంతుడివి చాహల్.. కోహినూర్ వజ్రం వంటి అందాన్ని చేజిక్కించుకున్నావ్.. అంటూ తమకు నచ్చిన విధంగా వర్ణిస్తున్నారు.

అమెరికాలో ధన శ్రీ అందాలు

శనివారం ఫ్లోరిడా వేదికగా భారత్, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరైన ధనశ్రీ.. గ్యాలరీలో కూర్చొని చాహల్‌ను ఉత్తేజపరుస్తూ మ్యాచ్‌ను ఆస్వాదించింది. అయితే ఈ భామ వేసుకొచ్చిన డ్రెస్ మాత్రం మరో లెవెల్ అని చెప్పాలి. వైట్ టాప్ లుక్‌లో తళక్కుమన్న ధనశ్రీ.. ఎద అందాలను చూపిస్తూ బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించింది. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు.. వెరీ ప్రెట్టీ, స్టన్నింగ్, మైండ్ బ్లోయింగ్​, సూపర్ హాట్​ అంటూ​ ఎమోజీలతో కామెంట్​ సెక్షన్ బాక్స్​ను నింపేస్తున్నారు.