ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన క్రికెటర్లు

ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన క్రికెటర్లు

ఒడిషాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మూడు రైళ్లు ఢీ కొన్న ఈ ఘటనలో 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. రైళ్లు అతివేగంతో ప్రయాణిస్తూ ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడంతో.. కొన్ని బోగీలు గాల్లోకి లేచి, తిరిగిపోయాయి. అంతేబలంగా కిందికి పడిపోవడంతో  ప్రయాణికులు వాటికింద నలిగిపోయారు. ఆ ప్రమాద దృశ్యాలు అందరినీ కలవరపరుస్తున్నాయి. ఈ విషాదకర ఘటనపై భారత క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా స్పందించారు.  

కోహ్లీ.. 'ఒడిషాలో రైళ్లు ఢీకొన్న ప్రమాదవార్త విని నేను చాలా బాధపడ్డాను. ఈ ప్రమాదంలో కుటుంబాలను కోల్పోయిన వారి చుట్టే నా ఆలోచనలు తిరుగుతున్నాయి. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. 

https://twitter.com/imVkohli/status/1664862533818122240

సురేష్ రైనా.. 'ఒడిషా రైలు విషాద ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..' అని రైనా ట్వీట్ చేశారు.

https://twitter.com/ImRaina/status/1053480564379058176 

మయాంక్ అగర్వాల్.. 'బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలు చూశాక నా హృదయం బద్దలైంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను..' అని మయాంక్ ట్వీట్ చేశాడు. 

https://twitter.com/mayankcricket/status/1664859087962533888

వీరేంద్ర సెహ్వాగ్.. 'ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద దృశ్యాలు తీవ్రమైన వేదన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో తమకు ఇష్టమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి..' అని సెహ్వాగ్ పోస్ట్ చేశారు.

https://twitter.com/virendersehwag/status/1664800779100667904

యువరాజ్ సింగ్.. 'ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా..' అని యువరాజ్ ట్వీట్ చేశారు. 

https://twitter.com/YUVSTRONG12/status/1664673396892860416