స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు తగ్గింది.. వ్యక్తిగత డిపాజిట్లు మాత్రం పెరిగాయ్

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు తగ్గింది.. వ్యక్తిగత డిపాజిట్లు మాత్రం పెరిగాయ్
  • గత ఏడాది డిపాజిట్ల విలువ రూ.36,793 కోట్లు

న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకులలో భారతీయుల నిధులు తగ్గాయి. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన డేటా ప్రకారం, 2025లో ఈ నిధుల విలువ ఎనిమిది శాతం క్షీణించి 3.5 బిలియన్​ స్విస్ ఫ్రాంక్స్​ (రూ.36,793 కోట్ల) స్థాయికి చేరింది. స్థానిక బ్రాంచ్​లు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చే నిధులు తగ్గడమే దీనికి కారణం. అయితే వ్యక్తిగత ఖాతాలలో ఉన్న డిపాజిట్లు 50 శాతం పెరిగి 524 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్​ (రూ. ఆరు వేల కోట్ల) స్థాయికి చేరుకున్నాయి.  

ఈ లెక్కల్లో నల్లధనం వివరాలు లేవు. పన్ను ఎగవేతను అడ్డుకోవడానికి స్విట్జర్లాండ్, భారత్ మధ్య సమాచార మార్పిడి ఒప్పందం అమల్లో ఉంది.  ప్రతి సంవత్సరం సమాచారాన్ని అందజేస్తారు. స్విస్ బ్యాంకుల్లో  బ్రిటన్‌‌కు చెందిన వ్యక్తుల నిధులు ఎక్కువగా ఉన్నాయి.  భారత్ 46 వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ నిధులు కూడా తగ్గాయి. బంగ్లాదేశ్ నిధులు పెరిగాయని స్విట్లర్లాండ్​ తెలిపింది.