న్యూఢిల్లీ: భారతీయ కుటుంబాల క్వార్టర్లీ ఖర్చులు గత మూడేళ్లలో 33 శాతానికి పైగా పెరిగి 2025లో రూ. 56 వేలకు చేరాయి. పట్టణ, గ్రామీణ భారతంలో వినియోగదారుల ఖర్చుల సరళిపై వరల్డ్ప్యానల్ బై న్యూమరేటర్ సంస్థ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కుటుంబ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖర్చులు అధికమయ్యాయి. 2022లో సగటు క్వార్టర్ ఖర్చులు రూ. 42 వేల ఉండగా, 2025లో అవి రూ. 56 వేలకి పెరిగాయి. పట్టణ కుటుంబాలు అధికంగా ఖర్చు చేస్తున్నప్పటికీ, గ్రామీణ కుటుంబాల ఖర్చులూ భారీగా పెరిగాయి.
అన్ని రకాల కుటుంబాల బడ్జెట్లపై ఒత్తిడి పెరుగుతోంది. పట్టణ మార్కెట్లలో సగటు క్వార్టర్ ఖర్చులు జూన్ 2022లో రూ. 52,711 ఉండగా, మార్చి 2024లో రూ. 64,583కి, మార్చి 2025లో రూ. 73,579కి పెరిగాయి.
గ్రామీణ కుటుంబాల సగటు క్వార్టర్ ఖర్చులు జూన్ 2022లో రూ. 36,104 నుంచి మార్చి 2025లో రూ. 46,623కి పెరిగాయి. ఈ నివేదికను ఆరు వేల కుటుంబాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా తయారు చేశారు.
