హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలెట్స్ రీసెర్చ్ (IIMR) యంగ్ ప్రొఫెషనల్ I పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 30న నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
పోస్టులు: యంగ్ ప్రొఫెషనల్ I.
ఎలిజిబిలిటీ: అభ్యర్థులు కనీసం 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు అగ్రికల్చర్లో రెండేండ్ల డిప్లొమా లేదా మూడేండ్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మిల్లెట్స్‌లో కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 45 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: 2025, అక్టోబర్ 30న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.millets.res.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
