
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT HYDERABAD)లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 26.
పోస్టుల సంఖ్య: 04 (రీసెర్చ్ అసోసియేట్)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 70 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్/ ఈసీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్ కమ్యూనికేషన్‌తో పాటు ఇంగ్లిష్ లో రాయడంలో ప్రావీణ్యం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 26.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతి నెలా రూ.25వేలు చెల్లిస్తారు.
జూనియర్ రీసెర్చ్ ఫెలో
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో లైఫ్ సైన్సెస్/ బయోటెక్నాలజీలో ఎం.టెక్/ ఎంఎస్సీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీలో బి.టెక్/ బి.ఫార్మా, బీవీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 26.
సెలెక్షన్ ప్రాసెస్: మెరిట్, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ద్వారా షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సీనియర్ పోస్ట్ డాక్టోరల్ ఫెలో
ఎలిజిబిలిటీ: కెమిస్ట్రీలో పీహెచ్డీ, క్రిస్టల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్‌లో మూడు నుంచి నాలుగేండ్ల పోస్ట్ డాక్టోరల్ అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 05.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.iith.ac.in వెబ్సైట్లో సంప్రదించగలరు.