ఆంత్రోపిక్ పోస్టుతో ఆగమాగం.. ఐటీ కంపెనీల షేర్లు 9 శాతం వరకు డౌన్

ఆంత్రోపిక్ పోస్టుతో ఆగమాగం.. ఐటీ కంపెనీల షేర్లు 9 శాతం వరకు డౌన్

న్యూయార్క్​: ఏఐ టెక్నాలజీ సంస్థ ఆంత్రోపిక్ సోషల్​ మీడియా పోస్టు అమెరికా స్టాక్​ మార్కెట్​ను వణికించింది. కొత్త ఏఐ సెక్యూరిటీ ఫీచర్ ప్రవేశపెటినట్టు ప్రకటించడంతో అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. క్రౌడ్‌‌స్ట్రైక్, ఆక్టా క్లౌడ్‌‌ఫ్లేర్ వంటి ప్రముఖ సంస్థల షేర్లు 5 శాతం నుంచి 9 శాతం వరకు పడిపోయాయి. ఇన్వెస్టర్లు దాదాపు 10 బిలియన్​ డాలర్లు నష్టపోయారు. 

సాఫ్ట్​వేర్​ కోడ్‌‌లోని లోపాలను గుర్తించి సరిచేసే సామర్థ్యం ఈ క్లాడ్ కోడ్ సెక్యూరిటీకి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. సంప్రదాయ భద్రతా పద్ధతులకు ప్రత్యామ్నాయంగా ఏఐ ఆధారిత సాధనాలు అందుబాటులోకి వస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ కూడా 2023  నవంబర్ స్థాయికి పడిపోయింది.